ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లాంతర్ ర్యాలీ..

ys-sharmala-08.jpg

ఏపీలో పెరిగిన విద్యుత్ చార్జీల తగ్గించాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరాగాంధీ సర్కిల్ వరకు లాంతర్ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే 17 వేల కోట్లు భారాన్ని మోపారు. వైసీపీకి కూటమికి చంద్రబాబు ప్రభుత్వాన్నికి తేడా ఏమీ లేదన్నారు. తెలంగాణలో 4.80 పైసలు యూనిట్ ధర ఉంటే ఆంధ్రలో యూనిట్ కి 6 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు సర్దుబాటు చార్జీలు పేరుతో 40 శాతం అధికంగా వసూలు చేస్తున్నారు. ప్రజలు మీకు ఓట్లు వేసింది వైసిపి మీద వ్యతిరేకత తోనే. ఇపుడు మీరు భారాన్ని మోపడం అన్యాయం అని షర్మిల పేర్కొన్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ అమలులో ఫెయిల్ అయ్యారు. సంక్షేమ పథకాలు అని చెప్పి ఒక చేత్తో ఇస్తున్నారు. మరో చేత్తో వసూలు చేస్తున్నారని షర్మిలపేర్కొన్నారు

Share this post

scroll to top