ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్‌ల్లో అందుబాటులో ఉండే నూడుల్స్ చిన్నా పెద్ద ప్లేట్లకు ప్లేట్లు లాగించేస్తుంటారు. అంతేకాకుండా ఎక్కడికైనా వెళ్లినా తొందరగా అయిపోతుందని నూడుల్స్ చేసుకొని బాక్స్‌లో పెట్టుకుని మరీ వెళ్తుంటారు కొందరు. అయితే గత కొద్ది రోజుల నుంచి ఇన్‌స్టంట్ నూడుల్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. వీటిని తయారు చేయడానికి ఎక్కువ సమయం పట్టదు కాబట్టి.. తమ వెంట క్యారీ చేస్తూ ఆకలేసి నప్పుడల్లా నూడుల్స్ తయారు చేసి తింటున్నారు.
ఆఫీసుల్లో, బస్సుల్లో ఇన్‌స్టంట్ నూడుల్స్ రెండు నిమిషాల్లోనే రెడీ కావడంతో బాగున్నాయని లొట్టలేసుకుని లాగించేస్తున్నారు. అంతేకాకుండా సమయం సేవ్ అయిందని సంతోషపడుతున్నారు తప్ప తమ ఆరోగ్యానికి మేలు చేస్తాయా లేదా అనే ఆలోచన కూడా చేయడం లేదు. చిన్నారులు సతాయించినా సరే నూడుల్స్ చేసి పెడతానని తల్లులు చెబుతుంటారు. దీంతో వారు సైలెంట్‌గా ఉండి చెప్పినట్లు వింటారు. అలాగే ఏడవకుండా ఆడుకుంటారు. అయితే ఇన్‌స్టంట్ నూడుల్స్ వల్ల ఆరోగ్యానికి హానీ కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.