పసుపు పాలు తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుందా

వర్షాకాలం కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటాం. ఎందుకంటే, సమ్మర్ హీట్ నుంచి ఉపశమనం అందుతుందని ఆశిస్తాం కాబట్టి. ఐతే, ప్రతి సీజన్ తనతో పాటు ఛాలెంజెస్ ను ఆలాగే హెల్త్ ఇష్యూస్ ను తీసుకువస్తుంది. వర్షాకాలం ఇందుకు మినహాయింపేమీ కాదు. వర్షాకాలంలో ఎన్నో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దోమకాటుతో వచ్చే టైఫాయిడ్, డెంగ్యూ, చికున్ గున్యా వంటి వ్యాధులతో పాటు కలుషిత నీటి ద్వారా కలరా వంటి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మహమ్మారితో పోరాడుతోంది. కాబట్టి వర్షాకాలంలో మనం మరింతగా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం ముఖ్యం. వర్షాకాలంలో ఫిట్ గా అలాగే హెల్తీగా ఉండేందుకు పాటించవలసిన టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ కాలంలో వెజిటబుల్స్ ను, ఫ్రూట్స్ ను మరీ ముఖ్యంగా ఆకుకూరలను శుభ్రంగా వాష్ చేసి తినడం ముఖ్యం. ఇంట్లో వండిన పదార్థాలని తినేందుకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అలాగే బాయిల్డ్ వెజిటబుల్స్ నే తినాలి.

బయటి ఫుడ్స్ ను పూర్తిగా అవాయిడ్ చేయాలి. లేదంటే, నీటి ద్వారా సోకే డిసీజెస్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ జోలికి వెళ్లనే వెళ్లొద్దు. వర్షాకాలంలో రోడ్లన్నీ నీళ్లతో అలాగే బురదతో నిండి ఉంటాయి. ఇవన్నీ హానికర బాక్టీరియాకు నిలయం. అటువంటి ప్రదేశాల్లో ఎంత ఎక్కువసేపు ఫుడ్ ఐటమ్స్ ఓపెన్ ఎన్విరాన్మెంట్ లో ఉంటాయో అంత ఎక్కువగా వాటిలో బాక్టీరియా చేరే ప్రమాదం ఉంటుంది. మీరు ఈ టైంలో స్ట్రీట్ సైడ్ జంక్ ఫుడ్ కు అట్రాక్ట్ ఐతే హానికర క్రిములు మీకు అట్రాక్ట్ అవుతాయి.

టర్మరిక్ మిల్క్, గ్రీన్ టీ, తులసి, దాల్చిన, ఇలాచీ అలాగే వార్మ్ వాటర్ కు మీ డైట్ లో భాగమివ్వాలి. ఏవైనా అలర్జీ సమస్యలున్నా , జలుబు, దగ్గు లేదా ఫీవర్ వచ్చినా ఈ ట్రెడిషనల్ హెల్త్ చిట్కాలతో తగ్గిపోతాయి. ఇవన్నీ నేచరుల్ ఇమ్యూన్ బూస్టర్స్ లా పనిచేస్తాయి.