కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మూవీ ది గోట్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి కథానాయిక. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ నిర్మించింది. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషించారు. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇప్పటికే పలు ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు పూర్తి అయ్యాయి. విజయ్ ఇక రాజకీయాల్లో బిజీ కానున్నాడని, ఇదే అతడి చివరి చిత్రం అని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మరీ ఈ చిత్రానికి సోషల్ మీడియాలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఓ సారి చూద్దాం. ఈ మూవీ అదిరిపోయిందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఫస్టాప్ బాగుందని, సెకండాఫ్ ఇంకా బాగుందని చెబుతున్నారు. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోరు ఓ రేంజ్‌లో ఉందంటున్నారు. విజయ్ ఖాతాలో మరో భారీ బ్లాక్ బాస్టర్ పడినట్లేనని అతడి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.