బాలయ్య- బోయపాటి సినిమా అప్డేట్ వచ్చేసిందోచ్!..

balaya-d.jpg

నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. నందమూరి తారక రామారావు వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల తెలుగు వాళ్లున్నా జై బాలయ్య అనేలా ఎదిగారు. 60 ఏళ్ల వయసులో చాలా మంది హీరోలు సినిమాలు చేస్తున్నా బాలయ్య మాత్రం స్పెషల్. ఇక బాలయ్య – బోయపాటి శ్రీను కాంబో అభిమానులతో పాటు అందరికీ ఫేవరేట్. వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ.. మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి పెద్ద హిట్ అయ్యాయి. హ్యాట్రిక్ హిట్ కొట్టారు ఈ కాంబో. దీంతో ఈ కాంబోలో మరో సినిమా ఉంటుందని, అఖండ 2 అని గతంలోనే ప్రకటించారు.

బాలకృష్ణ పుట్టిన రోజు కావడంతో బాలయ్య – బోయపాటి సినిమా అప్డేట్ ప్రకటించారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రామ్ ఆచంట – గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వీరిద్దరి కాంబోలో నాలుగో సినిమాగా నేడు సినిమాని ప్రకటించారు. BB4 వర్కింగ్ టైటిల్ తో ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Share this post

scroll to top