సీఎం చంద్రబాబుకు బీజేపీ నేతల మూడు విజ్ఞప్తులు..

cbn-bjp21.jpg

మాజీ సీఎం వైఎస్‌ జగన్ టార్గెటుగా పావులు కదుపుతోంది ఏపీ బీజేపీ.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ కుంభకోణాలను వెలికి తీయాలని చంద్రబాబుకు ఏపీ బీజేపీ విజ్ఞప్తి చేసింది.. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మూడు విజ్ఞప్తులు చేశారు బీజేపీ నేతలు.. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో జరిగిన మద్యం, ఇసుక మాఫియాలపై సమగ్ర విచారణ జరిపాలని ఏపీ సీఎంకు బీజేపీ బృందం విజ్ఞప్తి చేసింది.. ఇప్పటికే ఏపీలోని మద్యం, ఇసుక మాఫియాలపై కేంద్రానికి పురంధేశ్వరి ఫిర్యాదు చేసిన విషయం విదితమే.. మరోవైపు.. బీజేపీ కార్యాలయం ఏర్పాటుకు స్థలం కోరుతూ మరో విజ్ఞాపన ఇచ్చారు నేతలు..

Share this post

scroll to top