మూడున్నర ఏళ్లుగా కార్మికుల చేతుల్లో ఉన్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం ఇప్పుడు కీలక దశకు చేరింది. స్టీల్ ప్లాంట్ మనగడసాగించాలన్నా మూతపడాలన్న వచ్చే ఆరు నెలలు అత్యంత కీలకమైన సమయంగా ప్రజాసంఘాలు భావిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీల ద్వారా కేంద్రంపై పొలిటికల్ లాబీయింగ్ చేస్తూనే ఉద్యమ వేడిని మరింత విస్తరించాలని నిర్ణయించాయి. తాజాగా ఉక్కు పరిరక్షణ పోరాటంలోకి ఉత్తరాంధ్ర విద్యార్థి, మేథావి,ఉద్యోగ, ప్రజా సంఘాలు ఎంటర్ అవుతున్నాయి. ఆంధ్రుల హక్కుగా వచ్చిన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడమే లక్ష్యంగా గాంధీ గిరికి సన్నద్ధమయ్యాయి. ఉక్కు సత్యాగ్రహ దీక్షపేరుతో ఎక్కడికక్కడ రిలే దీక్షలు ప్రారంభమవుతున్నాయి.
- Home
- News
- Andhra Pradesh
- స్టీల్ ప్లాంట్ పోరాటం ఉధృతం..