ఆసుపత్రిలో చేరిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌..

rajanikanth-01.jpg

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన చెన్నైలోని ఆసుపత్రిలో చేరారు. సోమవారం అర్ధరాత్రి ఆయన ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఆయనకు ఇవాళ గుండె సంబంధిత వైద్య పరీక్షలు చేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలుస్తున్నది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. మంగళవారం కార్డియాక్‌ క్యాథ్‌ ల్యాబ్‌లో ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ సాయి సతీశ్‌ పర్యవేక్షణలో ఎలక్టివ్‌ ప్రొసీజర్‌ను నిర్వహించనున్నారు. తలైవర్‌ ఆసుపత్రిలో చేరారన్న వార్తలతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే, ఆసుపత్రిలో ఆయన చేరికపై కుటుంబీకులు ఎవరూ అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఆయన వెట్టయాన్‌ మూవీలో నటిస్తున్నది. చివరగా ఆయన ఆడియో లాంచ్ కార్యక్రమంలో కనిపించారు. టీజీ జ్ఞానవేల్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఈ నెల 10న విడుదల కానున్నది.

Share this post

scroll to top