కంగువ రిలీజ్‌ డేట్ ఫిక్స్.. సూర్య, తలైవాల మధ్య యుద్ధమే!

surya-28.jpg

పాన్‌ ఇండియా లెవెల్‌లో హీరో సూర్యకు ఉన్న స్టార్‌డమ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన, వైవిధ్యమైన కథలతో సూర్య ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. అందుకు తగినట్లుగానే కంగువ కథను ఎంచుకున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే చాలా అప్‌డేట్స్ వచ్చాయి. కంగువ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం కోసం ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ డేట్ రానే వచ్చింది. ఇక తాజాగా మేకర్స్.. కంగువ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్ 10 న కంగువ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుందని ప్రకటించారు. ఈ విషయాన్ని వెల్లడించడానికి సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. హీరో సూర్య ఈ పోస్టర్లో హీరో చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు. ఈ పోస్టర్‌ భారీ యాక్షన్ ఎపిసోడ్‌కు సంబంధించిన దానిలా ఉంది. ఈ పవర్‌ఫుల్ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కంగువ. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్, కేవీఎన్‌ ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్ల పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, స్టార్ హీరోయిన్ దిశా పటానీలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఆసక్తికరంగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన రజనీకాంత్ వేట్టైయన్ కూడా అదే రోజున విడుదల కానుంది. ఒకే రోజు రెండు భారీ చిత్రాలను విడుదల చేయడం వల్ల కలెక్షన్లకు గండి పడే అవకాశం ఉంది. ఈ రెండు చిత్రాలు ఒకే రోజు వస్తే రెండింటి మధ్య పోటీ నెలకొననున్నట్లు తెలుస్తోంది.

Share this post

scroll to top