Tag Archives: adimulapu suresh

స్కూల్స్‌కు సెలవులు ఇచ్చే ఆలోచన లేదు : ఆదిమూలం సురేశ్‌

 కోవిడ్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలోనూ.. తమ ప్రభుత్వం విద్యార్థులకు ఉన్నత విద్యనందించాలని లక్ష్యంగా పెట్టుకున్నదనీ.. పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదనీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్‌ స్పష్టం చేశారు. గురువారం గుంటూరు వడ్లమూడిలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌తో కలిసి, మంత్రి సురేష్‌ ఈరోజు ఆన్‌లైన్‌ విద్యాభ్యాసం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. భవిష్యత్తులో ఉన్నతవిద్యనభ్యసించే విద్యార్థులకు ఆన్‌లైన్‌ విధానం తప్పనిసరి. రానున్న కాలంలో ఆన్‌లైన్‌కోర్సులకు మరింత డిమాండ్‌ ...

Read More »

యూజీ, పీజీ పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి సురేష్

యూజీ, పీజీ పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి సురేష్

పదో తరగతి పరీక్షల మాదిరి యూజీ, పీజీ పరీక్షలు రద్దయ్యే అవకాశం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తున్నామే తప్ప రద్దన్న ప్రశ్న ఉత్పన్నమే కాలేదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఉన్నత విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థుల పరీక్షల నిర్వహణ, రాబోయే విద్యా సంవత్సరంలో చేయాల్సిన పనులపై రాష్ట్రంలో ఉన్న 16 యూనివర్సిటీల వీసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం పరిస్థితులపై ఏ విధంగా ముందుకు వెళ్లాలో సమీక్షించారు. అనంతరం మంత్రి సురేష్‌ మీడియాతో ...

Read More »

ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా

ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. మార్చి 31 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. రెండు వారాలపాటు పరీక్షలు వాయిదా వేయనున్నట్టు ఆయన తెలిపారు. మార్చి 31 తర్వాత పరిస్థితులను సమీక్షించి కొత్త తేదీలు ప్రకటిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం కరోనా కట్టడిపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాపి నిరోధక చర్యల్లో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

Read More »

ఈసీ పై మండిపడ్డ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

ఈసీ పై మండిపడ్డ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

ఎన్నికలను వాయిదా వేసే హక్కు ఈసీ రమేష్‌కుమార్‌కు ఎవరిచ్చారని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రశ్నించారు. మంగళవారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల నిలుపుదల అనేది రాష్ట్ర చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుందన్నారు. ఎన్నికలను వాయిదా వేయడాన్ని ప్రజలు కూడా తప్పు పడుతున్నారని పేర్కొన్నారు. గవర్నర్‌ చేత ఆమోదం పొందిన షెడ్యూల్‌ను గౌరవించకుండా.. ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు. ఆయన తన పరిధి దాటి వ్యవహరించి.. రాజ్యాంగ వ్యవస్థలను కాల రాశారని మండిపడ్డారు.స్థానిక ...

Read More »