Tag Archives: anasuya

తనను ట్రోలింగ్‌ చేస్తున్నవారిపై యాంకర్‌ అనసూయ ఫిర్యాదు

టాలీవుడ్‌ స్టార్‌, బుల్లితెర యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ ను టార్గెట్‌ చేస్తూ గత కొద్దిరోజులుగా నెటిజన్లు సోషల్‌మీడియాలో అసభ్యకరమైన రీతిలో రచ్చ చేస్తున్న సంగతి విదితమే. దీనిపై మండిపడ్డ యాంకర్‌.. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అయినప్పటికీ వెనక్కు తగ్గని నెటిజన్లు మరింతగా ఆంటీ అంటూ వేలకొద్దీ ట్వీట్లు చేసి అసభ్యపదజాలాలు వాడారు. దీనిపై తాజాగా అనసూయ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read More »

సునీల్‌కి జోడీగా అనసూయ

అనసూయ యాంకర్‌గా బుల్లితెరపైన రాణిస్తూనే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తోంది. అలాగే కొన్ని సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌లో కూడా మెరుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక అనసూయకు సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అందులో రంగమ్మత్తగా ప్రేక్షకులను మెప్పించింది. ఆ సినిమా తర్వాత అనసూయకు అవకాశాలు క్యూ కట్టాయి. అడవి శేష్‌ నటించిన క్షణం సినిమాలో అనసూయ నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. స్పెషల్‌ సాంగ్స్‌, స్పెషల్‌ రోల్స్‌తోనే కాకుండా పలు లేడీ ఓరియెంటెడ్‌ ...

Read More »

సోషల్ మీడియా సాక్షిగా అనసూయకు వేధింపులు

సోషల్ మీడియా సాక్షిగా అనసూయకు వేధింపులు

ప్రముఖ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌కు సోషల్‌ మీడియా వేదికగా వేధింపులు ఎక్కువైపోయాయి. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ట్విటర్‌ వేదికగా ఫిర్యాదు చేశారు. అనసూయ ఫిర్యాదుపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు స్పందించారు. అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొందరు వ్యక్తులు శృతిమించుతూ చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలకు స్పందించపోతే సహనానికి అర్థం ఉండదని అనసూయ ట్వీట్‌ చేశారు. తన ఫిర్యాదు స్పందించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు అనసూయ ధన్యవాదాలు తెలిపారు.

Read More »