Tag Archives: ap cabinet

నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నిర్ణయం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలపై ప్రకటన ఉండే అవకాశం ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందులో ఒకటి. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ప్రభుత్వంపై పడే ఆర్థిక భారానికి సంబంధించిన నివేదికను ఆర్థికశాఖ ఇప్పటికే ప్రభుత్వానికి అందించింది. ప్రస్తుతం ఇదే పథకాన్ని కర్ణాటక, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. మహిళలకు ఉచిత ...

Read More »

త్వరలో మంత్రివర్గంలో మార్పులు-క్యాబినెట్లో సంకేతాలు ఇచ్చిన జగన్‌

మంత్రివర్గమార్పు త్వరలో జరగనున్నట్లు సిఎం జగన్‌ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం వెలగపూడి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. ఈ సమయంలో సిఎం మాట్లాడుతూ కొత్తగా పలువురు మంత్రి పదవులు ఆశిస్తున్నారని, ఈమేరకు గతంలో మాట ఇచ్చామని తెలిపారు. వారిని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి ఉన్న రీత్యా ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారిలో కొంతమంది పార్టీ పదవులు తీసుకుని జిల్లాలో పార్టీని గెలిపించాలని సూచించారు. రాబోయే ప్రభత్వుంలో మరలా మంత్రివర్గంలో వారికి అవకాశం ఉంటుందని అన్నట్లు తెలిసింది. ప్రభుత్వం అధికారంలోకి ...

Read More »

ఏపీ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు ఇవే..

ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీకేబినెట్‌ సమావేశం ముగిసింది. రైతు భరోసా పథకం, ఇన్‌పుట్‌ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్‌ ద్వారా చెల్లింపులు చేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సమావేశంలో ఇళ్ల పట్టాల పంపిణీ, పక్కా ఇళ్ల నిర్మాణంపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ సర్వే అండ్‌ బౌండరీ చట్ట సవరణ, ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక పాలసీని కేబినెట్‌ ఆమోదించింది. 6 జిల్లాల్లో వాటర్‌షెడ్ల అభివృద్ధి పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ...

Read More »

వైఎస్సార్‌‌ ఆసరా పథకానికి కేబినెట్‌ ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో నిర్వహించిన కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ కేబినెట్‌ బేటీలో సీఎం జగన్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఆసరా పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నవరత్నాల్లో భాగంగా మరో హామీ అమలు చేసే దిశగానే వైఎస్సార్‌ ఆసరా పథకం ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా నాలుగేళ్లలో 27వేల కోట్లకుపైగా డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరనుంది. దీంతో పాటు నూతన పారిశ్రామిక విధానానికి కూడా ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కేబినెట్‌ ...

Read More »

జగన్ కేబినెట్ లోకి ఇద్దరు కొత్త మంత్రులు

జగన్ కేబినెట్ లోకి ఇద్దరు కొత్త మంత్రులు

ఇద్దరు బయటకు. ఇద్దరు లోపలికి. ఇది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటుచేసుకున్న తాజా మార్పులు. మంత్రులుగా ఉండి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణల రాజీనామాలతో ఖాళీ అయిన మంత్రివర్గ బెర్తులను బుధవారం నాడు భర్తీ చేశారు. కొత్తగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు లు నూతన మంత్రులుగా బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ వీరిద్దరితో మంత్రులుగా ప్రమాణం చేయించారు. కొత్త మంత్రులు ఇద్దరే కావటంతో అతి తక్కువ సమయంలో ...

Read More »

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి సమావేశం ముగిసింది. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటుపై మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కొత్త జిల్లా ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటు కానుంది. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. పార్లమెంట్‌ నియోజకవర్గం సరిహద్దుగా కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఎన్నికల్లో ...

Read More »

నేడు ఏపీ కేబినెట్‌ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి నేడు (బుధవారం) సమావేశం కానుంది. వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటుపై చర్చించనున్నారు. దాంతోపాటు ఇసుక కార్పొరేషన్ ఏర్పాటుపైనా మంత్రి మండలి నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు పనులకు ఆమోదం తెలిపే అవకాశముంది. రాయలసీమ కరువు నివారణ కు ప్రాజెక్టుల నిర్మాణ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది.

Read More »

ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన కేబినెట్‌ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణతో పాటు పలు ముసాయిదా బిల్లులపై మంత్రివర్గం చర్చించింది. అదే విధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకంపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది

Read More »

ప్రారంభమైన ఏపీ మంత్రివర్గ సమావేశం

రాష్ట్రంలోని కీలకమైన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సోషల్‌ డిస్టెన్స్‌ కోసం వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఈ భేటీ ప్రారభమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల వైఎస్‌ఆర్ చేయూత పథకంపై సమావేశంలో చర్చించనున్నారు. చిరువ్యాపారుల ప్రభుత్వ సహాయం పథకం ప్రధానంగా సమావేశంలో చర్చకు రానుంది. వీటితో పాటు మూడు సవరణ బిల్లుల ముసాయిదాలపై కేబినెట్‌ చర్చించే అవకాశం ఉంది. పర్యావరణ, జీఎస్టీ, ఉన్నత విద్యా కమిషన్ సవరణ బిల్లులపై చర్చించనున్నారు. ఇక అసెంబ్లీ బడ్జెట్ ...

Read More »

నేడు రాష్ట్ర కేబినెట్‌ భేటీ

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరగనుంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో భౌతిక దూరం పాటించేలా సీట్లను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణతో పాటు పలు ముసాయిదా బిల్లు లపై ఇందులో చర్చించనున్నారు. మరికొన్ని ఎన్నికల హామీలకు కేబినెట్‌లో ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.

Read More »