దాదాపు 25 ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న 237 మంది ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా, డీడీవోలుగా ఒకేసారి పదోన్నతి కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రెండు దశాబ్దాలుగాపైగా ఎంపీడీవోలు చూసిన ఎదురుచూపులను సీఎం జగన్ ప్రభుత్వం నిజం చేయడంతో వారు ఆనందంలో మునిగితేలుతున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు.
Read More »Tag Archives: ap cm
జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు
రక్షాబంధన్ సందర్భంగా సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి హోంమంత్రి తానేటి వనిత, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్ అక్రమాని విజయనిర్మల, రుడా చైర్‌పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, మహిళా కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీ, గెడ్డం ఉమ రాఖీలు కట్టారు.
Read More »బాబును ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర ప్రజలదే: జగన్
చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లేనని, సంక్షేమ పథకాలను కాపాడుకునే బాధ్యత ప్రజలదేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాల్లో భాగంగా రెండో రోజైన శనివారం పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైన సీఎం జగన్ ప్రజలనుద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. చంద్రబాబును ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర ప్రజలదేనని, తనకున్న ఏకైక అండాదండా ప్రజలేనని మరోసారి స్పష్టం చేశారు సీఎం జగన్. ‘చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పధకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లే. చక్రాలు లేని సైకిల్‌ను చంద్రబాబు తొక్కలేకపోతున్నారు. రాష్ట్రంలో అందరికీ న్యాయం చేసేందుకే మూడు రాజధానులు. ...
Read More »భీమవరంలో 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ
భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి , ఏపీ మంత్రి రోజా, కేంద్ర మాజీ మంత్రులు, చిరంజీవి, పురందేశ్వరీ తదితర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక మనిషిని.. ఇంకొక మనిషి.. ఒక జాతిని మరొక జాతి.. ఒక దేశాన్ని మరొక దేశం దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని స్వాతంత్ర్య సమరయోధులు ఆకాంక్షించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దేశ స్వాతంత్ర్యం ...
Read More »పేదలకు సంక్షేమ పథకాలు ఆపేయాలని ఎల్లో బ్యాచ్ అంటోంది : జగన్
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని టీడీపీ చెబుతుందని జగన్ ఆరోపించారు. ఈ పథకాలు రద్దు చేస్తే ప్రజలు ఒప్పుకొంటారా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా కూడా చంద్రబాబు పాలన కావాలని దుష్టచతుష్టయం ప్రయత్నాలు చేస్తుందని జగన్ మండిపడ్డారు.
Read More »కేంద్ర విదేశాంగ మంత్రికి జగన్ లేఖ
బహ్రెయిన్ లో చిక్కుకున్న ఏపీ కార్మికులను స్వదేశానికి తీసుకురావాలని సీఎం జగన్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు విదేశాంగ మంత్రి జైశంకర్ కు లేఖ రాశారు. బహ్రెయిన్ లో ఏపీకి చెందిన అత్యధిక మంది పని చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే అక్కడి కంపెనీలు వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, త్వరగా కంపెనీలు వారిని స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని జగన్ కోరారు.
Read More »ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్: జగన్
ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్ అని సిఎం జగన్ పేర్కొన్నారు. మంగళవారం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో నిర్వహించిన ‘దిశ’ మొబైల్ యాప్ అవగాహన సదస్సులో ఎపి సిఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ… దిశ యాప్‌పై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని, ప్రతి మహిళతో దిశ యాప్ డౌన్‌లోడ్ చేయించాలని సూచించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఘటన తనను కలిచివేసిందని అన్నారు. యువతులు, మహిళల భద్రత కోసం దిశ యాప్ రూపొందించామని, ఇప్పటికే దిశ ...
Read More »కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సాగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి కన్నబాబు మీడియాకు వెల్లడించారు. నూతన ఇసుక విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇకపై ఇసుకను ఆఫ్‍లైన్‍లోనూ తెచ్చుకోవచ్చని మంత్రి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రీచ్‍లను ఒకే సంస్థకు, అదీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఒక వేళ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ముందుకు రాకపోతే బహిరంగ వేలం వేయాలని మంత్రివర్గం తీర్మానించింది. ...
Read More »వరలక్ష్మి కుటుంబానికి హోంమంత్రి పరామర్శ
ప్రేమోన్మాది దాడిలో బలైన ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి కుటుంబాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత సోమవారం పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల చెక్‌ను అందజేశారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ.. వరలక్ష్మి ఘటన చాలా బాధాకరమన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందని, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. వరలక్ష్మి కుటుంబానికి పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామన్నారు. ‘ ఈ హత్యలో నిందితునికి ఇతరులెవరైనా సహకరించారా ? అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ...
Read More »కరోనా పై సీఎం జగన్ సమీక్ష
కోవిడ్-19 పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, కోవిడ్-19 ఆస్పత్రుల సంఖ్యను 138 నుంచి 287కు పెంచినట్లు తెలిపారు. స్పెషలిస్టులను, డాక్టర్లను వీలైనంత త్వరగా అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్-19 కార్యక్రమాల్లో తాత్కాలికంగా నియమిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు పెంచాలని సీఎం జగన్ ఆదేశించారు. కోవిడ్ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, వైద్యులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు లోపాలను, సిబ్బంది ...
Read More »