Tag Archives: ap news

చిత్తూరు జల్లికట్టులో 30 మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఆదివారం నిర్వహించిన జల్లికట్టు కార్యక్రమంలో 30 మందికి పైగా గాయపడ్డారు. నిన్న చిత్తూరులో నిర్వహించిన జల్లికట్టు ఆట ‘పశువుల పండుగ’లో పొరుగున ఉన్న నెల్లూరు, కడప జిల్లాల నుంచి వచ్చినవారితోపాటు వందలాదిమంది పాల్గొన్నారు. కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించి, చంద్రగిరి మండల పరిధిలోని వార్షిక కార్యక్రమంలో 500 పైగా ఎద్దులు, వందలాది గ్రామస్థులు పాల్గొన్నారు. నివేదిక ప్రకారం… జల్లికట్టు వేడుకలో 30 మందికి పైగా గాయపడ్డారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలోని గుండుపల్లి మండలం ...

Read More »

బడ్జెట్‌లో వైద్యానికి ఎపిలో కేటాయింపు 6.6 శాతమే..!

వార్షిక బడ్జెట్‌లో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి అవసరమైన కేటాయింపులు పెరగడంలేదు. బడ్జెట్‌ గణాంకాలలో గణనీయమైన పెరుగుదలను చూపిస్తున్నప్పటికీ, నిధుల విడుదల మాత్రం ఆశించినస్థాయిలో ఉండటంలేదు. బడ్జెట్‌లో కనీసం ఎనిమిది శాతాన్ని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి కేటాయించాలని 15వ ఆర్థిక సంఘం అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఎపి 6.6 శాతం కేటాయించి దేశంలో ఎనిమిదో స్థానంగా ఉండటం గమనార్హం. రాష్ట్రాల బడ్జెట్‌లో వైద్య, ఆరోగ్యశాఖ కేటాయింపులపై పిఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌ సంస్థ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. 8 శాతం కేటాయింపును ...

Read More »

జనవరి 1 నుంచి వృద్ధాప్య పింఛను పెంపు

ఏపీలో వృద్ధాప్య పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. కొత్త ఏడాదిలో వృద్ధాప్య పింఛను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నెలనెలా రూ.2225 పెన్షన్‌ గా ఇస్తున్నారు. దీనిని రూ.2500కు పెంచి ఇవ్వనుంది. వచ్చే ఏడాది జనవరి1 నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నారు. ఈ మేరకు కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా సీఎం జగన్‌ వెల్లడించారు. అలాగే రానున్న 45రోజుల్లో నిర్వహించే కార్యక్రమాల వివరాలను సీఎం వెల్లడించారు. ఈ నెల 21న సంపూర్ణ గృహహక్కు పథకం ప్రారంభించనున్నారు. అలాగే అగ్రవర్ణ నిరుపేద ...

Read More »

మొట్టమొదటిసారి మహిళా కానిస్టేబుల్‌కు వీక్లీ బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌ అవార్డ్‌

జాతీయ రహదారిపై దొంగతనానికి పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో తెగువ చూపిన మహిళా కానిస్టేబుల్‌ కు అవార్డును జిల్లా ఎస్పీ అందజేశారు. మహిళా కానిస్టేబుల్‌కు తేనీరు అందించి, ఆమె చూపిన తెగువకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కంచికచర్ల పరిధిలో జాతీయ రహదారిపై జరిగిన దొంగతనం కేసులో నిందితులను అదుపులోకి తీసుకోవడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన కంచికచర్ల పోలీస్‌ స్టేషన్‌ మహిళా కానిస్టేబుల్‌-1577 టీ శివకుమారి కి మంగళవారం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ఐపీఎస్‌ వీక్లీ బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌ అవార్డును అందజేశారు. ఈ అవార్డు పొందిన మొట్టమొదటి ...

Read More »

వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్‌ పర్యటన

వరద బాధితులతో నేరుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. పొదుపు మహిళల రుణాలపై ఏడాది  వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం జగన్‌ తెలిపారు. వరద మృతుల కుటుంబాల్లో ఒకరికి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇస్తామని చెప్పారు.​ వరదలతో చాలా నష్టం జరిగిందనే విషయాన్ని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. వరద సహాయ కార్యక్రమాల్లో అధికారులు అద్భుతంగా పని చేశారని సీఎం జగన్‌ కొనియాడారు.

Read More »

ఉన్నత స్థాయికి ఎదగడానికి పేదరికం అడ్డుకారాదు.. సీఎం జగన్

జగనన్న విద్యా దీవెన పథకం అమలులో భాగంగా ఈ ఏడాది మూడో విడతగా దాదాపు 11.03 లక్షల మంది విద్యార్ధులకు రూ. 686 కోట్లను ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి నేరుగా వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు. జగనన్న విద్యా దీవెన దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన పేద విద్యార్ధులందరికీ పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్క పూర్తి ఫీజు రియింబర్స్‌మెంటే కాక, గత ప్రభుత్వ బకాయిలు రూ.1778 కోట్లతో కలిపి ...

Read More »

శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా జకియాఖానమ్‌

 శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ పదవి తొలిసారి మైనారిటీ మహిళకు దక్కింది. కడప జిల్లా రాయచోటికి చెందిన వైసిపి ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌ డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమెను స్వయంగా కూర్చీ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జకియా మాట్లాడుతూ మహిళల సంక్షేమ కోసం అనే పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్‌ మహిళా పక్షపాతి అని నిరూపించుకున్నారని ఆమె కొనియాడారు. దేశానికే మన రాష్ట్రం ...

Read More »

ఐదో రోజు అసెంబ్లీ స‌మావేశాలు

 అమరావతి: ఐదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు మరో 9 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శాసనసభ ముందుకు ఏపీఎస్‌ఆర్టీసీ, కార్మికశాఖ వార్షిక ఆడిట్‌ రిపోర్టు తీసుకురానుంది. బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ సంక్షేమం, వైద్యంపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది. శాసనసభలో ఆమోదించిన 11 బిల్లులను నేడు మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. విద్యుత్‌ సంస్కరణలు, రాష్ట్రంలో రోడ్లు, రవాణా సౌకర్యాలపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది.

Read More »

ఏపీ అసెంబ్లీలో కులగణన తీర్మానం

కులగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఈ తీర్మానాన్ని రాష్ట్ర మంత్రి వేణుగోపాల్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిఎం జగన్‌ మాట్లాడుతూ 1931 తరువాత కులపరమైన జనాభా గణన జరగలేదని తెలిపారు. దేశంలో వెనకబాటుతనం తెలుసుకోవాలంటే లెక్కలు అవసరమని సీఎం స్పష్టం చేశారు. కులగనణపై కేంద్రానికి అనేక ప్రతిపాదనలు పంపామని గుర్తుచేశారు. కులగణన డిమాండ్‌కు తాము మద్దతు తెలుపుతున్నామని ఆయన చెప్పారు. దేశంలో బీసీల జనాభా 52 శాతంగా ఉన్నారని పేర్కొన్నారు. బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ ...

Read More »

రేపు కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక

 కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్లకు సంబంధించిన ఎన్నికలను రేపు(బుధవారం) నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. టిడిపి దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. విచారణ సందర్బంగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ హైకోర్టుకు రావాలని ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు అధికారులు విచారణకు హాజరయ్యారు. కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ , రిటర్నింగ్‌ అధికారి, విజయవాడ ఇన్ఛార్జి సిపి కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. వివరణ అనంతరం రేపు ...

Read More »