Tag Archives: ap news

ఎపి కి మరో మూడు లక్షల కోవిషీల్డ్‌ టీకాలు..

ఎపి కి మరో మూడు లక్షల కోవిషీల్డ్‌ టీకాలు చేరుకున్నాయి. సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేసిన కోవిషీల్డ్‌ టీకాలు గురువారం ఉదయం ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. ఎయిర్‌పోర్టు నుండి టీకాలను వ్యాక్సిన్‌ నిల్వ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి వైద్యారోగ్యశాఖ ఆదేశాల మేరకు ఆయా జిల్లాలకు పంపిణీ చేయనున్నారు.

Read More »

ఎపి ఇంటిలిజెన్స్‌ ఎస్‌పి రాంప్రసాద్‌ కరోనాతో మృతి

ఎపి ఇంటిలిజెన్స్‌ ఎస్‌పి రాంప్రసాద్‌ 10 రోజులుగా కరోనాతో పోరాడుతూ గురువారం ఉదయం కన్నుమూశారు. పోలీస్‌ శాఖలో సమర్థవంతమైన అధికారిగా రాంప్రసాద్‌కు మంచి పేరు ఉంది. గతంలో విజయవాడ ట్రాఫిక్‌ ఎడిసిపి గా విధులను నిర్వర్తించారు. ప్రస్తుతం కౌంటర్‌ ఇంటిలిజెన్స్‌లో నాన్‌ కేడర్‌ ఎస్‌పి గా ఉన్నారు.

Read More »

కరోనాతో పెరుగుతున్న ఉద్యోగుల మరణాలు

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఇదే సందర్భంలో రాష్ట్ర సచివాలయం మొదలుకొని గ్రామ సచివాలయాల వరకు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలోనే కోవిడ్‌-19 భారిన పడుతున్నారు. కోవిడ్‌ రెండో దశ విజృంభణ పెరిగిన నేపథ్యంలో ఇటీవల పదుల సంఖ్యలో ఉద్యోగులు మరణించారు. రాష్ట్ర సచివాలయంలో పది రోజుల్లోనే ఐదుగురు ఉద్యోగులు కోవిడ్‌కు బలి అయ్యారు. దీంతో సచివాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ...

Read More »

టిడిపి కార్పొరేటర్‌ వానపల్లి రవి కుమార్‌ కరోనాతో మృతి

విశాఖ టిడిపి కార్పొరేటర్‌ వానపల్లి రవి కుమార్‌ కరోనాతో బాధపడుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. కరోనా బారినపడిన రవికుమార్‌ గత మూడు రోజులుగా విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మఅతి చెందారు. ఇటీవల జరిగిన జివిఎంసి ఎన్నికల్లో 31 వ వార్డు కార్పొరేటర్‌గా వానపల్లి రవి కుమార్‌ ఎంపికయ్యారు. గతంలో అనాథ శవాల అంత్యక్రియలు వంటి సామాజిక కార్యకలాపాలను రవికుమార్‌ నిర్వహించారు.

Read More »

సిజెఐ గా జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం

భారత అత్యున్నత న్యాయస్థానం 48 వ ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేడు ప్రమాణం స్వీకారం చేశారు. శనివారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ఆయన చేత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన రెండో తెలుగు వ్యక్తి ఈయనే కావడం విశేషం. అంతకుముందు 1966 జూన్‌ 30 నుంచి 1967 ఏప్రిల్‌ 11 వరకు తెలుగు వ్యక్తి జస్టిస్‌ కోకా సుబ్బారావు సీజేఐగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటి వరకు సిజెఐగా ఉన్న ఎస్‌.ఎ.బోబ్డే పదవీకాలం ...

Read More »

ఎపి సచివాలయంలో కరోనా కలకలం

ఎపి సచివాలయంలో కరోనా కలకలం రేగుతోంది. సచివాలయంలోని ఉద్యోగస్థులను కరోనా భయం వెంటాడుతోంది. కొందరు ఆస్పత్రులలో చికిత్స పొందుతుండగా, మరికొందరు హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఇప్పటికే కరోనా బారినపడి సచివాలయంలో నలుగురు ఉద్యోగులు మృతి చెందారు. తాజాగా మరో ఉద్యోగి కరోనాతో మృతి చెందారు. కార్మికశాఖలో సెక్షన్‌ అధికారి (ఎస్‌ఒ) శరత్‌ చంద్ర గురువారం రాత్రి మరణించారు. కొద్దీరోజుల క్రితమే శరత్‌చంద్ర కరోనా బారిన పడి విజయవాడలోని ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న మృతి చెందారు.

Read More »

ఏపీ లో కరోనా తో ఒకే కుటుంబంలో నలుగురు మృతి

కరోనా రెండోదశ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కృష్ణాజిల్లా విజయవాడలోని ఓ న్యాయవాది కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. కరోనాతో నాలుగు రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు కరోనాతో మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం తెల్లవారుజామున కరోనాతో న్యాయవాది దినేశ్‌ తండ్రి మృతి చెందగా, మధ్యాహ్నం దినేశ్‌ మృతి చెందారు. కాగా, మూడు రోజుల క్రితం కరోనాతో దినేశ్‌ తల్లి, బాబాయి మృతి చెందారు.

Read More »

ఎపిలో రేపటి నుంచి 1-9 తరగతులకు సెలవులు

ఇంటర్‌ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సరేష్‌ స్పష్టం చేశారు. టెన్త్‌ పరీక్షలు కూడా షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహిస్తామన్నారు. అయితే, 1 నుంచి 9వ తరగతుల వరకు విద్యార్థులకు రేపటి నుంచి సెలవులు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనాపై సమీక్ష జరిపామని, పాఠశాలల్లో కరోనా వేగంగా విస్తరిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

Read More »

తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు పోలింగ్‌ ప్రారంభమైంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది. నెల్లూరు జిల్లాలోని నాలుగు, చిత్తూరు జిల్లాలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 17,10,699 మంది ఓటర్లున్నారు. వీరిలో మహిళలు 8,71,943 మంది, పురుషులు 8,38,540 మంది. 2,470 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీలతో పాటు మొత్తం 28 మంది పోటీలో ఉన్నారు.

Read More »

కాసేపట్లో ముగియనున్న ఉపపోరు ప్రచారం

తిరుపతి ఉపపోరు ప్రచారం కాసేపట్లో ముగియనుంది. శనివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. కరోనా కారణంగా ఓటింగ్‌ సమయాన్ని పెంచినట్లుగా ఎన్నికల అధికారి తెలిపారు. 16లక్షల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. సిపిఎం తరపు నుండి నెల్లూరు యాదగిరి, వైసిపి తరపున డాక్టర్‌ గురుమూర్తి, టిడిపి తరపున పనబాక లక్ష్మి, బిజెపి-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి నెల్లూరు యాదగిరి గట్టి పోటీ ఇవ్వనున్నారు.

Read More »