Tag Archives: ap news

ఐదో రోజు అసెంబ్లీ స‌మావేశాలు

 అమరావతి: ఐదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు మరో 9 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శాసనసభ ముందుకు ఏపీఎస్‌ఆర్టీసీ, కార్మికశాఖ వార్షిక ఆడిట్‌ రిపోర్టు తీసుకురానుంది. బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ సంక్షేమం, వైద్యంపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది. శాసనసభలో ఆమోదించిన 11 బిల్లులను నేడు మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. విద్యుత్‌ సంస్కరణలు, రాష్ట్రంలో రోడ్లు, రవాణా సౌకర్యాలపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది.

Read More »

ఏపీ అసెంబ్లీలో కులగణన తీర్మానం

కులగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఈ తీర్మానాన్ని రాష్ట్ర మంత్రి వేణుగోపాల్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిఎం జగన్‌ మాట్లాడుతూ 1931 తరువాత కులపరమైన జనాభా గణన జరగలేదని తెలిపారు. దేశంలో వెనకబాటుతనం తెలుసుకోవాలంటే లెక్కలు అవసరమని సీఎం స్పష్టం చేశారు. కులగనణపై కేంద్రానికి అనేక ప్రతిపాదనలు పంపామని గుర్తుచేశారు. కులగణన డిమాండ్‌కు తాము మద్దతు తెలుపుతున్నామని ఆయన చెప్పారు. దేశంలో బీసీల జనాభా 52 శాతంగా ఉన్నారని పేర్కొన్నారు. బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ ...

Read More »

రేపు కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక

 కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్లకు సంబంధించిన ఎన్నికలను రేపు(బుధవారం) నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. టిడిపి దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. విచారణ సందర్బంగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ హైకోర్టుకు రావాలని ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు అధికారులు విచారణకు హాజరయ్యారు. కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ , రిటర్నింగ్‌ అధికారి, విజయవాడ ఇన్ఛార్జి సిపి కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. వివరణ అనంతరం రేపు ...

Read More »

మూడు రాజధానుల బిల్లు వెనక్కు : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్వొకేట్ జనరల్‌ స్వయంగా హైకోర్టుకు తెలిపారు. ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశంలోనూ మూడు రాజధానులపైనే చర్చ జరిగింది. అయితే, మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కు తగ్గిందా లేదా తన వ్యూహం మార్చిందా అన్నదే అంతుపట్టడం లేదు. మూడు రాజధానులపై టెక్నికల్‌గా సమస్యల్ని పరిష్కరించి మళ్లీ బిల్లులు పెడతారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగు చట్టాల్ని రద్దు చేస్తూ మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ...

Read More »

అసెంబ్లీలో ‘వారి’ ప్రస్తావనే తేలేదు.. : పేర్ని నాని

అసెంబ్లీలో ఎవరూ చంద్రబాబు కుటుంబ సభ్యులు, వారి శ్రీమతి ప్రస్తావనే తేలేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. అసెంబ్లీలో వ్యవసాయం మీద చర్చ జరుగుతుంటే దానిపై మాట్లాడకుండా అనవసర మాటలతో రాద్దాంతం చేసింది చంద్రబాబేనని అంటూ నాని అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు సతీమణిని ఎవరైనా ఏమైనా అని ఉంటే ఆ ఫోన్‌ రికార్డును బయట పెట్టాలని పేర్ని నాని డిమాండ్‌ చేశారు. శాసనసభలో చంద్రబాబు తన అనుభవాన్ని రంగరించి మెలో డ్రామా సఅష్టించారన్నారు. రాజకీయాలను రాజకీయాలతోనే ఎదుర్కోవాలని సూచించారు. కుటుంబ మర్యాదను ...

Read More »

ఈ నెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన 10 మంది మాజీ సభ్యులకు శాసనసభలో నివాళులర్పించారు. బద్వేలు ఎమ్మెల్యే సుధా ప్రమాణస్వీకారంతో అసెంబ్లీ మొదలైంది. ఈ ఒక్క రోజే సమావేశం నిర్వహించాలని భావించగా.. టిడిపి పొడిగించాలని కోరిన పిదప.. బిఎసి సమావేశంలో ఈ నెల 26 వరకు  సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో  ఈ నెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి.  అసెంబ్లీ ఆరు నెలల కాలంలో ఒకసారి నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నెల 20వ తేదీతో ఆరు నెలలు పూర్తికావస్తున్నందున.. గురువారం నుండి ...

Read More »

ప్రారంభమైన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ముందుగా అనుకున్నట్టు ఒకరోజు కాకుండా 9 రోజులపాటు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26 వ తేదీవరకూ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇవాళ ప్రారంభమైన తొలిరోజు సమావేశంలో ఇటీవల మృతి చెందిన ప్రజా ప్రతినిధులకు సంతాపం ప్రకటించారు. బద్వేలు ఉపఎన్నికలో విజయం సాధించిన ఎమ్మెల్యే డాక్టర్ సుధతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రమాణ స్వీకారం చేయించారు.

Read More »

ఏపీ మున్సిపల్ ఫలితాల్లో ఫ్యాన్ హవా

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ కారణాలతో నిలిచిపోయిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి. నెల్లూరు కార్పొరేషన్‌ సహా 13 మున్సిపాలిటీల కౌంటింగ్‌ నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. ఇందులో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 9 మున్సిపాలిటీలను అధికార పార్టీ వైసీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అధినేత ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీతో సహా ఆకివీడు, పెనుకొండ, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, గురజాల, బుచ్చిరెడ్డిపాలెం, దాచేపల్లిలో వైసీపీ విజయ ఢంకా మోగించింది. ప్రకాశం జిల్లా దర్శిలో మాత్రం టీడీపీ గెలుపొందింది. ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం జరిగిన మున్సిపల్ ఎన్నికలకు ఓట్ల ...

Read More »

తుఫాన్ వల్ల నష్టపోయిన రైతుల ఖాతాలోకి నష్ట పరిహారం

తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సహకారం అందించనుంది ఏపీ ప్రభుత్వం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన గులాబ్‌ సైక్లోన్‌ చాలా భీభస్తమ్ సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ సైక్లోన్‌ వల్ల 34,586 మంది రైతులు పంట నష్టపోయారు. అయితే ఆ రైతుల ఖాతాల్లోకి 22 కోట్ల రూపాయల పంట నష్ట పరిహారం అందించనుంది జగన్ సర్కార్. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌. ఈ క్రాప్‌ ఆధారంగా నమోదైన రైతులకు పంట నష్టపరిహారం పంపిణీ ...

Read More »

రాజధాని కేసులపై విచారణ… హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు

అమరావతి రాజధాని కేసులపై హైకోర్టులో విచారణ ప్రారంభం అయింది. రాజధాని కేసుల నుంచి న్యాయమూర్తులు సత్యనారాయణ మూర్తి, సోమయాజులను తప్పించాలని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే పిటిషన్ వేశారు. రాజధానిలో ఆ ఇద్దరు న్యాయమూర్తులకు భూములున్నాయని.. వారిని ధర్మాసనం తప్పించాలని కోరారు దుష్యంత్ దవే. గతంలో ఇవే పిటిషన్లపై విచారణ చేపడుతోన్నప్పుడు ఎందుకు అభ్యంతరం తెలపలేదని హైకోర్టు ప్రశ్నించింది.

Read More »