Tag Archives: Arvind Kejriwal

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు షాక్‌..

మద్యం కేసుకు సంబంధించి మనీలాండరింగ్ అంశంలో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి వైభవ్ కుమార్‌పై వేటు పడింది. 2007లో ప్రభుత్వ ఉద్యోగిపై దాడి, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదయింది. నోయిడాకు చెందిన మహేశ్ పాల్ అనే వ్యక్తి ఈ కేసును దాఖలు చేశారు. వైభవ్ కుమార్‌.. మరో ముగ్గురితో కలిసి ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేశాడని కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ ఆఫ్ ...

Read More »

సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఢిల్లీ సీఎం

లిక్కర్ స్కాంలో తన అరెస్టు అక్రమమని, నిబంధనల ఉల్లంఘనే అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టు ఆశ్రయించారు. తనను వెంటనే విడుదల చేయాలంటూ ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇవే అంశాలతో ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను నిన్న విచారించిన కోర్టు.. కేజ్రీవాల్ అరెస్టులో ఎలాంటి అతిక్రమణలు జరగలేదని తేల్చింది. ఆధారాలు ఉన్నాయంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చేసిన వాదనతో ఏకీభవించింది. కేజ్రీవాల్ అరెస్టు సక్రమమేనని పేర్కొంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ పిటిషన్ ను కొట్టేసింది. దీనిపై ...

Read More »

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీకి సిద్ధం

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆప్‌ సిద్ధమేనని ఆమ్‌ఆద్మీపార్టీ (ఆప్‌) కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తెలిపారు. సోమవారం అహ్మదాబాద్‌లోని నవ్రంగ్‌పురలో ఆప్‌ పార్టీ కార్యాలయాన్ని కేజ్రీవాల్‌ ప్రారంభించారు. కేజ్రీవాల్‌ సమక్షంలో ప్రముఖ పాత్రికేయుడు ఇసుదన్‌ గాద్వి ‘ఆప్‌’లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..వచ్చే ఏడాది జరగనున్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాల్లోనూ అప్‌ అభ్యర్థులు పోటీ చేస్తారని, అందుకు ఆప్‌ సిద్ధంగా ఉందని అన్నారు. కాగా, కేజ్రీవాల్‌ అహ్మదాబాద్‌ రావడం ఈ ...

Read More »

ఢిల్లీ ఘర్షణలు.. 20కి చేరిన మరణాలు

ఢిల్లీ ఘర్షణలు.. 20కి చేరిన మరణాలు..

ఢిల్లీ: సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో చనిపోయిన వారి సంఖ్య 20కి చేరింది. బుధవారం జీటీబీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ నలుగురు చనిపోయారు. అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13 నుంచి 20కి పెరిగింది. ఈ ఘర్షణల కారణంగా ఈశాన్య ఢిల్లీలోని 86 కేంద్రాల్లో సీబీఎస్‌ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఘర్షణలను తీవ్రంగా తీసుకున్న హోం మంత్రి అమిత్ షా.. నిత్యం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. ఢిల్లీలో పరిస్థితిని సమీక్షించేందుకు జాతీయ భద్రతా ...

Read More »

ప్రారంభమైన ఢిల్లీ ఎన్నికల పోలింగ్.. ఎన్నడూలేని విధంగా భారీ భద్రత

ప్రారంభమైన ఢిల్లీ ఎన్నికల పోలింగ్.. ఎన్నడూలేని విధంగా భారీ భద్రత

ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యింది. మొతత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలోనే పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 1.5 కోట్ల మంది ఓటర్ల తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, అత్యధికంగా పురుష ఓటర్లు 81,05,236 మంది, మహిళా ఓటర్లు 66,80,277 మంది ఉన్నారు. అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ సహా వివిధ పార్టీలకు చెందిన 672 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరంతా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఢిల్లీ ఎన్నికల కోసం భారీగా ...

Read More »