Tag Archives: covid

టీమిండియాకు ఎదురుదెబ్బ… ద్రవిడ్‌కు కోవిడ్‌ పాజిటివ్‌

మరో 4 రోజుల్లో ఆసియా కప్‌ ప్రారంభం కానుండగా … టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆసియా కప్‌ కోసం యూఏఈ బయలుదేరే ముందు కరోనా పరీక్షలు నిర్వహించగా రాహుల్‌ ద్రవిడ్‌కు పాజిటివ్‌ అని నిర్థారణ అయ్యింది. దీంతో భారత ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ లేకుండా జట్టు యూఏఈకి వెళ్లాల్సి వుంటుంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, పంత్‌ వంటి ఆటగాళ్లు యూఏఈకి చేరుకున్నారు. ఈ టోర్నీలో భారత్‌ తన తొలి మ్యాచ్‌ను ఆగస్టు 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఆ ...

Read More »

జులై 15 నుండి అందరికీ ఉచితంగా బూస్టర్ డోసు

శవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ఆజాదీకా అమృత్‌ మహాత్సవ్‌’లో భాగంగా బూస్టర్ డోస్ (ప్రీకాషన్ డోస్)   పంపిణీ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 18 నుండి 59 ఏళ్ల వారికి మూడో డోసును ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. 75 రోజుల పాటు కొనసాగే ఈ ప్రత్యేక కార్యక్రమం జులై 15 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Read More »

మరో నటుడికి కరోనా

మలయాళ నటుడు జయరామ్‌కి కరోనా సోకింది. ఇటీవల మమ్ముట్టి, దుల్కర్‌ సల్మాన్‌, సురేష్‌ గోపీలు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. నిన్న (శనివారం) తనకి కరోనా పాజిటివ్‌ గా నిర్దారణ అయినట్టు సోషల్‌ మీడియాలో ప్రకటించారు. తనకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయిందని, వైరస్‌ ఇంకా మనతోనే ఉందని, మనకు గుర్తు చేస్తోందని అన్నారు. తనతో కాంటాక్ట్‌ లో ఉన్నవారు ఐసోలేట్‌ అవ్వాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు. లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నట్లు ట్వీట్‌చేశారు. తాను ట్రీట్‌ మెంట్‌ మొదలు పెట్టానని, ...

Read More »

అమెరికాలో కరోనా విశ్వరూపం

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విశ్వరూపం దాల్చింది. మహమ్మారి తీవ్రతతో అమెరికాలో ప్రతీ సెకన్‌కు 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. వైద్య నిపుణుల వివరాల ప్రకారం … అమెరికాలో ఒకే రోజు 14,49,005 మందికి వైరస్‌ సోకింది. వారం రోజుల సగటును పరిశీలిస్తే.. అమెరికాలో ప్రతీ సెకన్‌కు 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 21,041,50 మంది వైరస్‌ బారినపడ్డారు. 4,608 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో.. మొత్తం కేసులు 311,019,858, మరణాలు 5,511,955 ...

Read More »

మంచు మనోజ్‌కు కరోనా పాజిటివ్‌

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌కు కోవిడ్‌ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు. ‘నాకు క‌రోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవ‌ల న‌న్ను క‌లిసిన ప్రతి ఒక్కరు వెంట‌నే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరుతున్నా. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా. నా గురించి ఆందోళన అక్కర్లేదు. మీ అందరి ఆశీర్వాదాలతో ఆరోగ్యంగా

Read More »

బ్రిటన్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

బ్రిటన్‌లో కరోనా కల్లోల్లం సృష్టిస్తోంది. కోవిడ్‌ మొదలైన నాటి నుండి బుధవారం రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే 78, 610 కొత్త కేసులు వెలుగుచూశాయి. జనవరిలో నమోదైన గరిష్ట సంఖ్య కన్నా 10 వేలు ఎక్కువ. రాబోయే కొద్ది రోజుల్లో కేసుల్లో పెరుగుదల ఉండవచ్చునని బ్రిటన్‌ సీనియర్‌ హెల్త్‌ చీఫ్‌ ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటన్‌లో 67 మిలియన్‌ మంది ప్రజలు ఉండగా.. ఇప్పటి వరకు 11 మిలియన్ల మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడ్డారు. నూతన ...

Read More »

చైనాలో పెరుగుతున్న కరోనా డెల్టా కేసులు

చైనాలో కొవిడ్‌ వైరస్‌ డెల్టా వెరియంట్‌ విజృంభిస్తోంది. ఈనెల 17వ తేదీ నుండి ఇప్పటి వరకు 11 ప్రావిన్స్‌లకు ఈ డెల్టా వెరియంట్‌ విస్తరించినట్లు స్థానిక వైద్య అధికారులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణీకుల కారణంగానే ఈ వేరియంట్‌ చైనాలోకి ప్రవేశించిందని చెప్పారు. కొవిడ్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఎమర్జెన్సీ పరిస్థితులను విధించినట్లు తెలిపారు. గాన్సు ప్రొవిన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రజా రవాణాను నిషేధించారు. శనివారం నాడు మొత్తం ఏడు ప్రావిన్సిలలో 26 కేసులు నమోదైనట్లు స్థానిక వైద్య అధికారులు తెలిపారు. బీజింగ్‌లోనూ కేసులు ...

Read More »

4 లక్షలు దాటిన కరోనా మరణాలు

దేశంలో కరోనా మరణాలు నాలుగు లక్షలు దాటాయి. నిన్న దేశవ్యాప్తంగా 853 మంది చనిపోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4 లక్షల 312కు పెరిగింది. ఇక నిన్న  దేశవ్యాప్తంగా 46 వేల 617 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు. నిన్నటితో పోల్చితే 4.4 శాతం కేసులు తగ్గాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3 కోట్ల 4 లక్షల 58 వేల 251కి పెరిగింది. ఇక ఇప్పటివరకూ 2 కోట్ల 95 లక్షల 48 వేల 302 మంది కరోనా ...

Read More »

భారత్ లో ఒక్క రోజులోనే 4,200 పైగా మరణాలు

భారత్‌లో మృత్యు ఘోష వినిపిస్తోంది. కరోనా తొలి వేవ్‌లో కన్నా రెండవ వేవ్‌లో రికార్డు స్థాయి మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 4,205 మంది కరోనాకు బలయ్యారు. ఇప్పటి వరకు భారత్‌లో ఈ సంఖ్యే గరిష్టం. మొత్తంగా రెండున్నర లక్షల మందిని కరోనా పొట్టనపెట్టుకుంది. అదేవిధంగా 3,48,421 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ సంఖ్యతో దేశంలో ఇప్పటి వరకు 2,33,40,938 మంది కరోనా బారిన పడగా…2,54, 197 మంది మహమ్మారి బలి తీసుకుంది. ప్రస్తుతం దేశంలో 37,04,099 యాక్టివ్‌ కేసులున్నాయి. కాగా, కర్ణాటకలో ...

Read More »

దేశంలో మృత్యు ఘంటికలు.. 4 వేలు దాటిన కరోనా మరణాలు

భారత్‌లో కరోనా మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 4 వేలకు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇవి రికార్డు స్థాయి మరణాలు. కేసులు కూడా 4 లక్షలను దాటాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 4,01,078 కరోనా కేసులు పుట్టుకొచ్చాయి. వారంలో నాలుగు లక్షల కేసులు దాటడం ఇది నాల్గవ సారి. 4,187 మంది మరణించారు. ఈ గణాంకాల ప్రకారం దేశంలో మొత్తంగా 2,18,92,676 కేసులవ్వగా…2,38,270 మంది మృత్యువాత ...

Read More »