Tag Archives: disha app

మహిళలు పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేదు..జగన్

ఏదైనా సమస్యతో ఫిర్యాదులివ్వాలన్నా.. కేసులు పెట్టాలన్నా మహిళలు పోలీసుస్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేదని గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఫిర్యాదులు చేయొచ్చునని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. దిశ యాప్‌లోని అన్ని ఫీచర్లపై మహిళా పోలీసులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి రెండు వారాలకు ఒకసారి జిల్లా కలెక్టర్, ఎస్పీ సమావేశం కావాలని, ప్రజా సమస్యలతో పాటు మహిళా భద్రతపైనా సమీక్షించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక పంపించాల్సి ఉంటుందని సూచించారు.

Read More »

ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్: జగన్

ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్‌ అని సిఎం జగన్‌ పేర్కొన్నారు. మంగళవారం విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడి గ్రామంలో నిర్వహించిన ‘దిశ’ మొబైల్‌ యాప్‌ అవగాహన సదస్సులో ఎపి సిఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ… దిశ యాప్‌పై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని, ప్రతి మహిళతో దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించాలని సూచించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఘటన తనను కలిచివేసిందని అన్నారు. యువతులు, మహిళల భద్రత కోసం దిశ యాప్‌ రూపొందించామని, ఇప్పటికే దిశ ...

Read More »

దిశా యాప్ డౌన్లోడ్ ఇలా..

ఏపీ ప్ర‌భుత్వం గ‌తెడాది ఫిబ్ర‌వ‌రిలో దిశాయాప్‌ను రూపోందించి విడుద‌ల చేసింది.  దీనికి సంబందించి చ‌ట్టాన్ని, దిశా పోలీస్ స్టేష‌న్ల‌ను కూడా తీసుకొచ్చింది.  దిశా యాప్‌పై విస్తృత‌మైన అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం సిద్ద‌మైంది.  ప్ర‌తి మ‌హిళ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తెలిపారు.  ఇక ఈ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి… ఎలా ఉప‌యోగించాలో చూద్దాం. దిశాయాప్ ఆండ్రాయిడ్ వెర్ష‌న్‌ను ప్లేస్టోర్ ద్వారా, ఐఓఎస్ వెర్ష‌న్‌ను యాప్ స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.  డౌన్‌లోడ్ చేసుకున్నాక మొబైల్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేయ‌గానే ...

Read More »

దిశ చట్టం దేశంలోనే ఆదర్శం కానుంది: హోంమంత్రి సుచరిత

దిశ చట్టం దేశంలోనే ఆదర్శం కానుంది

ప్రత్తిపాడు నియోజకవర్గంలో హోంమంత్రి సుచరిత పర్యటించారు. బుడంపాటు, ఏటకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ.. దిశ మొబైల్‌ యాప్‌కు మంచి స్పందన వస్తోందన్నారు. పోలీసులు వెంటనే స్పందిస్తున్నారని బాధితులు అభినందిస్తున్నారన్నారు. దిశ చట్టం దేశంలోనే ఆదర్శం కానుందన్నారు. అయితే మంగళగిరి గ్యాంగ్‌రేప్‌పై మాత్రం సుచరిత నోరు మెదపలేదు. దీంతో సొంత జిల్లాలో గ్యాంగ్‌రేప్‌ జరిగితే స్పందించలేదంటూ ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read More »