Tag Archives: ec

ఆ ప్రాంతాలపై ఈసీ ఫోకస్

తక్కువ ఓటింగ్ నమోదవుతున్న 11 రాష్ట్రాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. దీనికి గల కారణాలపై CEC రాజీవ్ కుమార్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బిహార్, UP, ఢిల్లీ, ఉత్తరాఖండ్, TG, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, ఝార్ఖండ్, MP, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో 2019లో 67.40% ఓటింగ్ నమోదైంది. ఈ రాష్ట్రాల్లోని పట్టణాల్లో అత్యంత తక్కువ ఓటింగ్ నమోదవుతున్నట్లు గుర్తించారు.

Read More »

పెన్ష న్లపై కీలక అప్ డేట్

పెన్షన్ల పంపిణీలో వాలంటీర్ల ప్రమేయం ఉండొద్దని ఈసీ ఆదేశించిన వేళ.. సీఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకున్నారు. ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేయవచ్చని పలువురు కలెక్టర్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల ద్వారా వారంలో పెన్షన్లు ఇవ్వొచ్చని చెప్పారు. అర్బన్ ప్రాంతాల్లో కొంచెం కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. పెన్షన్ల పంపిణీపై రాత్రికి మార్గదర్శకాలు ఇస్తామని సీఎస్ పేర్కొన్నారు.

Read More »

రెండవ దశ లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

లోక్‌సభ ఎన్నికలు 2024లో భాగంగా రెండవ దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 26న జరగనున్న ఓటింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్రపతి తరపున కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. దీంతో నేటి నుంచి రెండో దశ నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ దశ పోలింగ్‌కు నామినేషన్ పత్రాల దాఖలుకు ఏప్రిల్ 4 చివరి తేదీగా ఉంది. జమ్మూ కశ్మీర్ మినహా మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఏప్రిల్ 5న నామినేషన్ పత్రాల పరిశీలన జరగనుంది. ఏప్రిల్ 6న జమ్మూ కశ్మీర్‌లో ...

Read More »

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ నోటీసులు

సీఎం జగన్‌పై టీడీపీ సోషల్ మీడియా విభాగం అసభ్యకర పోస్టులు పెడుతోందంటూ అందిన ఫిర్యాదుపై సీఈవో ముఖేష్ కుమార్ స్పందించారు. 24 గంటల్లో పోస్టులు తొలగించాలని ఆదేశించారు.ఫిర్యాదు మేరకు మాజీ సీఎం చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకీ ఫిర్యాదు చేశారు.దీనిపై సీఈవో స్పందిస్తూ నోటీసులు పంపారు.టీడీపీ సోషల్‌ మీడియా విభాగం పోస్టులు ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, 24 గంటల్లోగా సీఎం జగన్‌పై పెట్టిన అభ్యంతరకర ...

Read More »

ఏపీ ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్‌ కనగరాజ్‌ నియామకం

ఏపీ ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్‌ కనగరాజ్‌ నియామకం

ఆంధ్రప్రదేశ్‌ నూతన ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ)గా రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కనగరాజ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ నూతన ఎస్‌ఈసీగా జస్టిస్‌ కనగరాజ్‌ శనివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ జడ్జిని నియమించాలని ఏపీ ప్రభుత్వం నిన్న (శుక్రవారం) ఆర్డినెన్స్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ మేరకు జస్టిస్ కనగరాజ్‌ను ఎస్‌ఈసీగా ప్రభుత్వం నియమించింది.తమిళనాడుకు చెందిన జస్టిస్‌ కనగరాజ్ మద్రాస్‌ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. 1973 నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్న జస్టిస్ కనగరాజ్ ...

Read More »

ఎన్నికల వాయిదా మంచి పద్ధతి కాదు -వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవారాయలు

ఎన్నికల వాయిదా మంచి పద్ధతి కాదు -వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవారాయలు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ స్థానిక ఎన్నికలు ఏకపక్షంగా వాయిదా వేయడం సరికాదని వైఎస్సార్‌సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవారాయలు వ్యాఖ్యానించారు. మంగళవారం లోక్‌సభలో జీరో అవర్‌లో ఎంపీ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషనర్‌ ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించలేదని అన్నారు. ఎన్నికల కమిషన్‌ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తి చేశారని. జిల్లా కలెక్టర్లు యంత్రాంగాన్ని సిద్ధం చేసి ఉంచారని.. ఇలాంటి సమయంలో ఎన్నికలు వాయిదా వేయటం సరైన చర్య కాదని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ ...

Read More »

ఈసీ పై మండిపడ్డ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

ఈసీ పై మండిపడ్డ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

ఎన్నికలను వాయిదా వేసే హక్కు ఈసీ రమేష్‌కుమార్‌కు ఎవరిచ్చారని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రశ్నించారు. మంగళవారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల నిలుపుదల అనేది రాష్ట్ర చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుందన్నారు. ఎన్నికలను వాయిదా వేయడాన్ని ప్రజలు కూడా తప్పు పడుతున్నారని పేర్కొన్నారు. గవర్నర్‌ చేత ఆమోదం పొందిన షెడ్యూల్‌ను గౌరవించకుండా.. ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు. ఆయన తన పరిధి దాటి వ్యవహరించి.. రాజ్యాంగ వ్యవస్థలను కాల రాశారని మండిపడ్డారు.స్థానిక ...

Read More »