Tag Archives: jc

జేసీ ప్రభాకర్‌ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

జేసీ ప్రభాకర్‌ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

దివాకర్‌ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసులో అరెస్టైన జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌ రెడ్డికి న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. అనంతరం పోలీసులు వారిద్దరినీ అనంతపురంలోని రెడ్డిపల్లి జైలుకు తరలించారు. అంతకు ముందు ప్రభాకర్‌ రెడ్డి, అస్మిత్‌ రెడ్డికి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. కాగా, బీఎస్‌-3 వాహనాలను బీఎస్-‌4గా రిజిస్ట్రేషన్‌ చేసి అమ్మకాలు సాగించినట్లు తేలడంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. నకిలీ పత్రాలు సృష్టించి ఇప్పటివరకు 154 ...

Read More »

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి అరెస్ట్‌

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయనతో పాటు కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిని అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ అనంతరం వీరిని హైదరాబాద్‌ నుంచి అనంతపురానికి తరలిస్తున్నారు. బీఎస్‌-3 వాహనాలను బీఎస్-‌4గా రిజిస్ట్రేషన్‌ చేసి అమ్మకాలు సాగించినట్లు తేలడంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ వ్యవహారంపై కూపీ లాగగా నకిలీ పత్రాలు సృష్టించి ఇప్పటివరకు 154 వాహనాలు నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు గుర్తించారు. వాటికి సంబంధించిన ఫేక్‌ ఎన్‌ఓసీ, ఫేక్ ...

Read More »

జగన్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన జెసి

జగన్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన జెసి

మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి రమేష్‌కుమార్‌ను కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాతో పాటూ కీలక అంశాలపై చర్చించారు. అనంతర మాట్లాడిన జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ చాలా తెలివైనవారని.. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ తగ్గిందని.. టీడీపీ అయినంత మాత్రాన అన్నీ విమర్శించాలని లేదన్నారు. ఎన్నికల ప్రక్రియను కుదించడం స్వాగతించ తగ్గ విషయమే అన్నారు.ప్రతి పోలింగ్ బూత్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు మాజీ ఎంపీ ...

Read More »