Tag Archives: kcr

ఎన్నికలకు దూరంగా ఉన్న కేసీఆర్ కుటుంబం!

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. లోక్‌‌సభ ఎన్నికల బరి నుంచి బీఆర్‌‌‌‌ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఫ్యామిలీ తప్పుకున్నది. 23 ఏండ్ల ఆ పార్టీ చరిత్రలో ఇట్ల ఒక కీలక ఎలక్షన్​ నుంచి కల్వకుంట్ల కుటుంబం పూర్తిగా తప్పుకోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం 17 లోక్​సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. అందులో ఎక్కువ మంది కొత్తవాళ్లే. పార్టీని కేసీఆర్ స్థాపించిన అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం పోటీ చేస్తూనే ఉంది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవితల్లో ఎవరో ఒకరు ఎన్నికల బరిలో ...

Read More »

హైదాబాద్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్.. అభ్యర్థుల ఎంపిక పూర్తి

లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల ఎంపికను బీఆర్ఎస్ పూర్తిచేసింది. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీని దాటేసింది. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా మిగిలిన ఆ ఒక్క స్థానానికి అభ్యర్థిని ఫైనల్ చేశారు. హైదరాబాద్ స్థానం నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ పేరును ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థుల వేటలోనే ఉండి కొన్ని కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తుండగా కేసీఆర్ మొత్తం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడే బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే ఆదిలాబాద్‌ఆత్రం ...

Read More »

అక్కడి నుంచే కేసీఆర్ పోటీ!

మెదక్‌ లోక్‌సభ అభ్యర్థిత్వం విషయంలో గులాబీ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని జహీరాబాద్‌ టికెట్‌ను ప్రకటించినప్పటికీ, మెదక్‌ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ టికెట్‌ను వంటేరు ప్రతాప్‌రెడ్డికి ఇవ్వాలని అధినేత కేసీఆర్‌ పక్షం రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇంకా అధికారికంగా ప్రకటించడం లేదు. కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం తేలిన తర్వాత ఇక్కడి అభ్యర్థిని ప్రకటించే అవకాశాలున్నాయని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ టికెట్‌పై ఉత్కంఠ అలాగే కొనసాగుతోంది. కాగా ఈ టికెట్‌ కోసం మరో ఇద్దరు ముఖ్యనాయకులు ...

Read More »

నేడు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు కరీంనగర్ లో పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అచ్చొచ్చిన కరీంనగర్ లో ఈ రోజు సాయంత్రం భారీ బహిరంగ సభలో గులాబీ బాస్ పాల్గొననున్నారు. అయితే బీఆర్ఎస్ కరీంనగర్ స్థానం బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దాదాపు లక్ష మంది సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల, బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్ వినోద్ కుమార్ లు జన సమీకరణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇక్కడి ...

Read More »

తెలంగాణలో కీలక పరిణామం… కేసీఆర్‌తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను నందినగర్‌లోని ఆయన నివాసంలో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న సమయంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పోటీ చేస్తాయని… నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీరి కలయిక ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు హరీశ్ ...

Read More »

BRS పార్లమెంట్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. సోమవారం తెలంగాణ భవన్ వేదికగా పలు సెగ్మెంట్ల నేతలతో భేటీ అయిన కేసీఆర్.. ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలను దిశానిర్ధేశం చేశారు. అనంతరం నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఆయా సెగ్మెంట్ల నేతలతో సుదీర్ఘంగా చర్చించి పేర్లు ప్రకటించారు. ఖమ్మం అభ్యర్థిగా నామా నాగేశ్వర రావు, మహబూబాబాద్ అభ్యర్థిగా మాలోతు కవిత, పెద్దపల్లి అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్‌లను ప్రకటించారు. ...

Read More »

ఎన్నికల శంఖారావం పూరించనున్న కేసీఆర్

భారత రాష్ట్ర సమితి పార్టీ చీఫ్ కేసీఆర్ హైదరాబాద్ తెలంగాణ భవన్ లో కరీంనగర్, పెద్దపల్లి నేతలతో సమావేశం అయ్యారు. ఈ నెల 12న కరీంనగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభ ద్వారా లోక్ సభ ఎన్నికలకు సమరశంఖం పూరించాలని కేసీఆర్ భావిస్తున్నారు. కాగా, లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బీజేపీ నుంచే పోటీ ఎదురవుతుందని అన్నారు. ఎన్నికల కోసం నిర్వహించే రోడ్ షోలలో తాను కూడా పాల్గొంటానని కేసీఆర్ ప్రకటించారు. తద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ...

Read More »

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూతపై కేసీఆర్, కేటీఆర్ దిగ్భ్రాంతి

యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత మృతి చెందడం తనను కలచివేస్తోందని కేసీఆర్ విచారంం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని, వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ‘‘చిన్న వయసులోనే ప్రజామన్ననలు పొందిన లాస్య అకాల మరణం చెందడం ఎంతో బాధాకరం. కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్ఎస్ ...

Read More »

కాళేశ్వరం పాపం ఆ ఇద్దరిదే.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరం నుంచి నీటి తరలింపు ఆర్థిక భారం అని మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించడం సరికాదని గతంలో కేసీఆర్ వేసిన నిపుణుల కమిటీయే నివేదిక ఇచ్చిందని… అయినా వాటిని పట్టించుకోకుండా మేడిగడ్డ కట్టారని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పై ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మించాలని పురుగు పుట్టిందే కేసీఆర్ పుర్రెలో అని ధ్వజమెత్తారు. కేసీఆర్ కు ఏ దేవుడు కలలోకి వచ్చి చెప్పారో తెలియదు కానీ ఆయనే ...

Read More »

కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన తమిళిసై, కేటీఆర్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై, మాజీ మంత్రి కేటీఆర్ గ్రీటింగ్స్ తెలియజేశారు. ‘గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. ‘లెజెండ్ అయిన నా హీరోకు… 70వ జన్మదిన శుభాకాంక్షలు డాడ్’ అని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా గ్రీటింగ్స్ తెలియజేశారు.

Read More »