Tag Archives: kcr

జులైలో తొలిసారిగా కరోనాపై కేసీఆర్ సమీక్ష

జులైలో తొలిసారిగా కరోనాపై కేసీఆర్ సమీక్ష

తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. కరోనాను పకడ్బందీగా కట్టడి చేయడం ఎలా అనే అంశాలపై చర్చ జరిపారు. హోం ఐసోలేషన్లో ఉన్న బాధితులకు అందుతున్న చికిత్స.. కోవిడ్ రోగులకు మెరుగైన చికత్స అందించడం లాంటి అంశాలకు చర్చకు వచ్చాయి. ఈ భేటీలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. జూన్ 28న పీవీ శత జయంతి వేడుకలకు హాజరైన కేసీఆర్ అదే రోజు సాయంత్రం ...

Read More »

సచివాలయం కూల్చివేత వెనుక ‘ఆపరేషన్‌ ఖజానా’ -రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, సీఎం కేసీఆర్‌ కదలికలను లోతుగా పరిశీలిస్తే సచివాలయం కూల్చివేత వెనుక ‘ఆపరేషన్‌ ఖజానా’బయట పడిందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం తన పార్లమెంట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణలో అనుమానాస్పదంగా అనేక పనులు జరుగుతున్నాయి. దాదాపు రెండు వారాలపాటు సీఎం ఎవరికీ కనిపించలేదు. ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్న కొంతమంది మిత్రులు నాకు కొంత సమాచారం ఇచ్చారు. అదే సమాచారం మీడియాకు చెప్తున్నా’అని ఆయన అన్నారు. వేల మంది పోలీసుల ...

Read More »

కేసీఆర్ పై మండిపడ్డ భట్టి విక్రమార్క

రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు భయంతో రోజులు నెట్టుకురావాల్సి వస్తోందని కాంగ్రెస్‌ శాసనసభాపక్షం(సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలందరూ బిక్కుబిక్కుమంటుంటే సీఎం కేసీఆర్‌ చేతులెత్తేసి ఫామ్‌హౌస్‌కు వెళ్లారని ఎద్దేవా చేశారు. పొరుగున ఉన్న ఏపీలో కరోనా పాజిటివ్‌ 2.8 శాతం ఉంటే తెలంగాణలో 22 శాతం ఉందని, ఇది జాతీయ సగటు (7.14 శాతం) కన్నా చాలా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. అతితక్కువ ...

Read More »

2న రాష్ట్ర మంత్రివర్గ భేటీ

2న రాష్ట్ర మంత్రివర్గ భేటీ

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జూలై 2న రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా వైరస్‌ కట్టడి కోసం లాక్‌డౌన్‌ విధించే అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కరోనా వ్యాప్తి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో 15 రోజుల పాటు అత్యంత కఠినంగా లాక్‌డౌన్‌ విధించాలని ప్రతిపాదిస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌లో భాగంగా అత్యంత కఠినంగా కర్ఫ్యూ విధించాలని, రోజుకు కేవలం గంటా రెండు గంట లు మాత్రమే ...

Read More »

టీఆర్‌ఎస్ పై రెచ్చిపోయిన డీకే అరుణ

టీఆర్‌ఎస్ పై రెచ్చిపోయిన డీకే అరుణ

కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందుకే హైదరాబాద్‌ కరోనా హబ్‌గా మారిందని మాజీ మంత్రి, బీజేపీనేత డీకే అరుణ తీవ్ర స్థాయిలో విమర్శిం చారు. సీఎం కేసీఆర్‌కు ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ మీద ఉన్న కోపం ఇప్పుడు తెలంగాణ ప్రజలకు శాపమైందని వ్యాఖ్యానించారు. ఆదివారం పార్టీ ఎంపీ సోయం బాపూరావుతో కలసి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్‌లో ఓనర్లు, క్లీనర్ల పంచాయితీ నడుస్తోందని, వైరస్‌ను అడ్డం పెట్టుకుని టీఆర్‌ఎస్‌ చేస్తున్న ...

Read More »

లాక్‌డౌన్‌ వదంతులపై సీఎం కేసీఆర్‌ అడిగిన ప్రశ్నకు మోదీ జవాబు

లాక్‌డౌన్‌ వదంతులపై సీఎం కేసీఆర్‌ అడిగిన ప్రశ్నకు మోదీ జవాబు

దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారనే వదంతులు వినిపిస్తున్నాయని, దీనిపై స్పష్టతనివ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన విజ్ఞప్తికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. దేశంలో లాక్‌డౌన్‌ల దశ ముగిసి, అన్‌లాక్‌ దశ ప్రారంభమైందని ప్రధానమంత్రి బదులిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడారు. ‘దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రధానమంత్రి మీడియాతో మాట్లాడుతున్నారనగానే లాక్‌డౌన్‌ ప్రకటిస్తారని అనుకుంటున్నారు. ప్రధానమంత్రి అందరు ముఖ్యమంత్రులతో మాట్లాడకుండా లాక్‌డౌన్‌ విషయంలో నిర్ణయం తీసుకోరని నేను చెబుతున్నాను. దీనిపై స్పష్టత ఇవ్వండి’అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ...

Read More »

కృష్ణా బోర్డు ఎదుట తెలంగాణ, ఏపీ వాడివేడి వాదనలు..

సాగు నీటి వాటాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలు ఫిర్యాదులు చేసుకున్న వేళ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. హైదరాబాద్‌లోని జలసౌధలో గురువారం మధ్యాహ్నం మొదలైన సమావేశం సాయంత్రం ఆరుగంటల వరకూ సాగింది. ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు తమ వాదనలను బోర్డు సభ్యులకు వినిపించారు. అనంతరం తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. ఏపీలో పోలవరం, పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు మళ్లిస్తున్నందున ఆ మేరకు తెలంగాణకు అదనపు జలాలు ఇవ్వాలని బోర్డును కోరినట్లుగా ...

Read More »

తెలంగాణ అమరవీరులకు కేసీఆర్ నివాళి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరవీరులకు సీఎం కేసీఆర్‌ ఘనంగా నివాళులు అర్పించారు. మంగళవారం ప్రగతిభవన్‌ నుంచి గన్‌పార్క్‌కు చేరుకున్న ఆయన అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ఉన్నతాధికారులు అమరవీరులకు నివాళులు అర్పించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు.. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు

Read More »

తెలంగాణలో షూటింగులు షురూ

లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, ప్రిప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారు నియంత్రణ పాటించాల్సి ఉంటుందని సీఎం సూచించారు. సినిమా షూటింగులు ఎలా నిర్వహించుకోవాలనే విషయంలో విధి విధానాలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. టాలీవుడ్‌ ప్రముఖులతో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. సినిమా షూటింగులు, ప్రిప్రొడక్షన్ పునరుద్ధరణ, సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై చర్చించారు.సినిమా షూటింగులకు ...

Read More »

కేసీఆర్ కి కిషన్ రెడ్డి కౌంటర్

కేంద్ర ప్యాకేజీపై సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. కేసీఆర్‌ భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. మోదీ వెనుక దేశమంతా ఉందని న్యూయార్క్‌ టైమ్స్‌ సహా.. 50 అంతర్జాతీయ పత్రికలు ప్రచురించాయన్న సంగతి కేసీఆర్‌ తెలుసుకోవాలన్నారు. అడ్రస్‌ లేనివాళ్లు చెబితే ప్రధానిని విమర్శించడం కేసీఆర్‌కు తగదని చెప్పారు. కష్టకాలంలో ఓటు బ్యాంక్‌ రాజకీయాలు సరికాదన్నారు.

Read More »