Tag Archives: maha shivarathri

ప్రతి ఏటా శివరాత్రి శివాలయంలో నాగుపాము దర్శనం..

నిర్మల్ జిల్లాలోని దస్తురాబాద్ మండలం గొడిసెరాల రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా గర్భగుడిలో నాగుపాము దర్శనం ఇచ్చింది.మహా శివరాత్రి పండగను హిందువులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. దేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాలు, శివాలయాల్లో భక్తులు పోటెత్తారు. శివాలయాలు శివ నామస్మరణ తో మారుమ్రోగాయి. శివయ్య భక్తులే కాదు నేను కూడా అంటూ మహా శివరాత్రి రోజున శివయ్యను పూజించడానికి ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం అయింది. భోలాశంకరుడిని, నాగు పాముని దర్శించుకుని భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు.మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ...

Read More »

మహాశివరాత్రికి 120 ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రికి 120 ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా… భక్తుల సౌకర్యార్ధం 120 అదనపు బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రజా రవాణా శాఖ (ఆర్‌టిసి) డిప్యూటీ కమిషనరు జి.వరలక్ష్మి తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం ప్రజా రవాణా శాఖ (ఆర్‌టిసి) కార్యాలయంలోని డిప్యూటీ కమిషనరు ఛాంబరులో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జి.వరలక్ష్మి మాట్లాడుతూ… మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అదనంగా 120 ప్రత్యేక బస్సులను వేశామని తెలిపారు. గతేడాది శివరాత్రి సందర్భంగా 100 బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. శ్రీకాకుళం 1, 2 వ డిపోలు, పాలకొండ నుండి రామతీర్ధాలకు ...

Read More »