Tag Archives: medaram

ఫిబ్రవరి 27 నుంచి మరో రెండు హామీల అమలు: సీఎం రేవంత్ రెడ్డి

మేడారం జాతరకు విచ్చేసి సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆరు గ్యారెంటీల అమలుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, ఆ హామీల అమలుకు తామందరం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 27 సాయంత్రం మరో రెండు హామీల అమలుకు శ్రీకారం చుట్టనున్నామని… 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా హాజరవుతున్నట్టు ...

Read More »

మేడారం చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి… వనదేవతలకు పూజలు

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ ఉత్సవంగా పేరుగాంచిన మేడారం జాతర అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం మేడారం చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చిన ఆయనకు మంత్రి సీతక్క, అధికారులు ఘనస్వాగతం పలికారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను సీఎం రేవంత్ రెడ్డి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆచార సంప్రదాయాలను అనుసరించి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించారు. మేడారం జాతరలో సీఎంతో పాటు అమ్మవార్ల దర్శనం చేసుకున్నవారిలో మంత్రులు శ్రీధర్ ...

Read More »

మేడారం జాతర వేళ గవర్నర్ తమిళి సై కీలక నిర్ణయం

మేడారం జాతరను సందర్శించుకున్న గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఇక్కడి పరిసరాల్లోని ఆరు ఆదివాసీ గ్రామాలను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. ఆ గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కేంద్ర మంత్రి అర్జున్ ముండా, రాష్ట్ర మంత్రి సీతక్కలతో కలిసి సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్న అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ, వరుసగా మూడుసార్లు ఈ జాతరకు రావడం తన అదృష్టమన్నారు. గవర్నర్ హోదాలో ఆరేండ్ల కాలంలో మూడోసారి ఇప్పుడు దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ జరుగుతున్న ...

Read More »

నేడు మేడారం మహా జాతర ప్రారంభం

ఆసియాలోనే అది పెద్ద మేడారం జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. నేడు మండమెలిగే పండగ పేరుతో నిర్వహించే ఉత్సవంతో జాతర ప్రారంభమైనట్లుగా పూజారులు భావిస్తారు. ఈ ఆదివాసీ వేడుక బుధవారం ఉదయం నుంచి గురువారం వేకువజాము వరకూ జరుగుతుంది. మేడారంలోని సమ్మక్క దేవత పూజామందిరం, కన్నెపల్లి సారలమ్మగుడి, పూనుగొండ్ల, కొండాయి గ్రామాల్లో పగిడిద్ద రాజు, గోవిందరాజు ఆలయాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి. పూర్వకాలంలో ఈ ఆలయాల స్థానంలో గుడిసెలు ఉండేవి. రెండేళ్లకు ఇవి పాతబడి పోవడంతో పూజారులు అడవికి వెళ్లి మండలు, వాసాలు, ...

Read More »

నేటి నుంచి మేడారం మహాజాతర ప్రారంభం

నేటి నుంచి మేడారం మహాజాతర ప్రారంభం

నేటి నుంచి మేడారం మహాజాతర ప్రారంభమైంది. మేడారానికి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. నేడు పగిడిద్దరాజు గద్దెల వద్దకు చేరుకోనున్నారు. ఆనవాయితీ ప్రకారం పెనుక వంశస్తులు మహబూబాబాద్ జిల్లా పోనుగొండ్ల నుంచి.. సమ్మక్క భర్త పగిడిద్దరాజును తీసుకురానున్నారు. పడిగిద్దరాజును తీసుకు వచ్చేందుకుు కాలినడకన 66 కి.మీ.అటవీ మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంది. పెనుక వంశస్తులు కుంకుమ భరణి రూపంలో ఉన్న అమ్మవారిని సైతం తీసుకురానున్నారు.

Read More »