Tag Archives: modi video confirence

ఎల్లుండి మరోసారి సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

ఎల్లుండి మరోసారి సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. జులై 27న సోమవారం నాడు సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుపై చివరిసారిగా జూన్ 16,17 తేదీల్లో ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో మహమ్మారి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రులతో చర్చించేందుకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అయితే, కేవలం మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులతోనే ప్రధాని ...

Read More »

మోదీ వీడియో కాన్ఫరెన్స్.. లాక్‌డౌన్‌పై మే 3 తరువాతే నిర్ణయం

మోదీ వీడియో కాన్ఫరెన్స్.

మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో ప్రస్తుతం రెండో దశ లాక్‌డౌన్ కొనసాగుతోంది. మొదటి దశ మార్చి 24న ప్రారంభమై ఏప్రిల్ 14న ముగిసింది. రెండోదశ లాక్‌డౌన్ మే 3న ముగియనుంది. ఈ నేఫథ్యంలో కరోనా కట్టడికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటోన్న చర్యలను ప్రధాని సమీక్షించారు. లాక్‌డౌన్‌పై మే 3వ తేదీ తరువాత నిర్ణయం తీసుకుంటామని ప్రధాని.. సీఎంలతో అన్నట్లు సమాచారం. కరోనా వ్యాప్తి ఉన్నచోట్ల లాక్‌డౌన్‌ కొనసాగుతుందని పేర్కొన్నట్లు తెలిసింది. కరోనా ప్రభావం తక్కువున్న రాష్ట్రాల్లో, జిల్లాల ...

Read More »

నేడు సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్‌

నేడు సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్‌

కరోనాపై చేస్తున్న యుద్ధంపై అన్ని రాష్ర్టాల సీఎంలతో ప్రధాని మోడీ సోమవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేతపైనా చర్చిస్తారని సమాచారం. మినహాయింపులు, లాక్‌డౌన్‌ విషయంలో కేంద్రం నిర్ణయాలను కొన్ని రాష్ర్టాలు పాటించడం లేదు. కొన్ని రాష్ర్టాలైతే మే 3 తర్వాత కూడా లాక్‌డౌన్‌ కొనసాగింపుపై ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా అంశాలపై ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చ జరపనున్నారని తెలుస్తోంది.

Read More »