Tag Archives: nimmagadda

నిమ్మగడ్డపై ఎమ్మెల్యే రోజా ఆగ్రహం

రాష్ట్రఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై వైసిపి ఎమ్మెల్యే రోజా మరోసారి విరుచుకుపడ్డారు. మార్చి 31 తర్వాత నిమ్మగడ్డను ఎవ్వరూ పట్టించుకోరంటూ వ్యాఖ్యానించారు. 2019లో టీడీపీని ప్రజలు సమాధి చేశారని, ఆ టీడీపీకి జీవం పోయాలని నిమ్మగడ్డ తాపత్రయ పడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎక్కువ సర్పంచ్‌ స్థానాలను వైసిపినే గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు.  టీడీపీని బతికించుకునే బాధ్యతను నిమ్మగడ్డపై చంద్రబాబు, లోకేశ్‌లు పెట్టారన్నారు. అందుకే నిమ్మగడ్డ ఇలాంటి తలతిక్క పనులు చేస్తున్నారని విమర్శించారు. 

Read More »

ఎస్‌ఇసి నిమ్మగడ్డతో ప్రభుత్వ ప్రతినిధి బృందం భేటీ..

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతినిధి బృందం శుక్రవారం సమావేశం అయ్యింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్‌ దాస్‌, పంచాయితీ రాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ నిమ్మగడ్డను కలిసిన బృదంలో ఉన్నారు. పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించాలని కమిషన్‌ ప్రొసీడింగ్స్‌ ఇచ్చిన నేపథ్యంలో ఈ కీలక సమావేశం జరుగుతోంది. హైకోర్టు సూచించిన మేరకు.. ప్రభుత్వం తరుఫున ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల సంఘంతో చర్చిస్తోంది. ...

Read More »

స్థానిక ఎన్నికలపై మరోసారి సిఎస్‌ కు నిమ్మగడ్డ లేఖ

ఎపి స్థానిక ఎన్నికల నిర్వహణపై మరోసారి సిఎస్‌ కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ లేఖ రాశారు. ఈ లేఖలో కోర్టు ఆదేశాలను ఎన్నికల కమిషనర్‌ ప్రస్తావించారు. ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సీఎస్‌ తోపాటు పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్‌ కు కూడా నిమ్మగడ్డ లేఖ రాశారు. 2021 ఓటర్ల సవరణ ప్రక్రియను జనవరి నాటికి పూర్తి చేయాలని లేఖలో సూచించారు

Read More »

గవర్నర్‌తో ముగిసిన నిమ్మగడ్డ భేటీ..

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కమార్‌ భేటీ ముగిసింది. బుధవారం ఉదయం రాజ్‌భవన్‌లో సుమారు 45 నిమిషాల పాటు గవర్నర్‌తో నిమ్మగడ్డ చర్చలు జరిపారు. ఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశ్యకత, ఎన్నికలపై ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై గవర్నర్‌తో చర్చించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ వైఖరిపై రమేష్‌కుమార్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా ఎపిలో కరోనా పేరుతో ఎన్నికలను అడ్డుకుంటున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. చర్చలు ముగిసిన అనంతరం నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ నేరుగా ...

Read More »

నిమ్మగడ్డ అంశంలో స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అంశంలో కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్‌పై స్టే ఇవ్వాలని ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం విచారించింది. ఎపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విషయంలో ప్రతి విషయం తమకు తెలుసని, తామే కావాలని ఈ కేసులో స్టే ఇవ్వట్లేదని ధర్మాసనం తెలిపింది. గవర్నర్‌ లేఖ పంపినా రమేష్‌కుమార్‌కు పోస్టింగ్‌ ఇవ్వకపోవడం అత్యంత ...

Read More »

నిమ్మగడ్డ లేఖ వ్యవహారంలో కీలక పరిణామం.. సీఐడి చేతికి రిపోర్ట్

ఏపీ మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ లేఖ విషయంలో సీఐడీకి ఫోరెన్సిక్ నివేదిక అందినట్లు తెలుస్తోంది. నిమ్మగడ్డ రాసిన లేఖ ఎస్‌ఈసీ ఆఫీస్‌లో తయారు కాలేదని రిపోర్ట్‌లో తేలినట్లు సమాచారం. లాప్‌ట్యాప్, డెస్క్‌టాప్‌లను పరిశీలించి ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది. అలాగే నిమ్మగడ్డ పీఎస్ సాంబమూర్తి తప్పుడు సమాచారం ఇచ్చారన్న సీఐడీ చెబుతోంది. దీనికి సంబంధించి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కేంద్రానికి రాసిన లేఖపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ...

Read More »