Tag Archives: nirmala seetharaman

విశాఖ ఉక్కును అమ్మే తీరతాం.. నిర్మలా సీతారామన్‌

విశాఖ ఉక్కు కోసం ఓవైపున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నా.. కేంద్రానికి మాత్రం చీమకుట్టినట్లుగా కూడా లేదు. పైగా విశాఖ ఉక్కును అమ్మేస్తామని, 100శాతం పెట్టుబడులు ఉపసంహరిస్తున్నామని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంట్‌లో సోమవారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతోంది. లోక్‌సభలో వైసిపి ఎంపి ఎంవివి సత్యనారాయణ లేవనెత్తిన ప్రశ్నపై ఆమె స్పందిస్తూ.. విశాఖ ఉక్కు వ్యవహారంపై రాష్ట్రప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఈక్విటీ షేర్‌ లేదని బదులిచ్చారు. మెరుగైన ఉత్పత్తి కోసమే ప్రయివేటీకరిస్తున్నట్లు సమర్థించుకున్నారు. 

Read More »

కరోనా ప్యాకేజీ కింద పేదలకు 1.7 లక్షల కోట్ల సహాయం

కరోనా ప్యాకేజీ కింద పేదలకు 1.7 లక్షల కోట్ల సాయం

మానవాళిని మనుగుడకే పెను సవాలుగా పరిణమించిన కరోనా (కోవిడ్-19) వైరస్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పంజా విసిరింది. సంక్షోభం దిశగా పయనిస్తున్న ఈ ఉపద్రవం నుంచి బయట పడేందుకు ఆయా దేశాలు కకావికలమవుతున్నాయి. కేంద్ర బ్యాంకులు ద్రవ్య లభ్యతపై పలు చర్యలతో పాటు, ఉపశమన చర్యల్ని ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనా వైరస్‌ విపత్తు నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని సిద్ధం చేసింది. ఈమేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం నిర్వహించి మీడియా ...

Read More »