Tag Archives: perni nani

రామ్‌గోపాల్‌ వర్మ ట్వీట్లపై పేర్ని నాని కౌంటర్‌ ఎటాక్‌

ఎపిలో సినిమా టికెట్ల ధరల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల దీనిపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ వరుసట్వీట్లతో పాటు ‘ప్రభుత్వానికి పది ప్రశ్నలు’ పేరుతో ఒక వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్లపై ఎపి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పందించారు.- రూ.100 టికెట్‌ను రూ.1000, రూ.2000కు అమ్ముకోవచ్చని ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్‌ మెకానిజం అంటారు? డిమాండ్‌, సప్లరు అంటారా? లేక బ్లాక్‌ మార్కెటింగ్‌ అంటారా?– గత 66 సంవత్సరాలుగా చట్టాలకు లోబడే ప్రభుత్వాలు ధర ...

Read More »

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రికి మంత్రి పేర్ని నాని నివాళి

‘తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి సిరివెన్నెల’ అని ఎపి సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. బుధవారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి మంత్రి పేర్ని నాని నివాళులర్పించారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ… తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి సిరివెన్నెల అని పేర్కొన్నారు. ఎపి ప్రజల తరపున సిరివెన్నెల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిరివెన్నెల కుటుంబానికి ఎపి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.

Read More »

అసెంబ్లీలో ‘వారి’ ప్రస్తావనే తేలేదు.. : పేర్ని నాని

అసెంబ్లీలో ఎవరూ చంద్రబాబు కుటుంబ సభ్యులు, వారి శ్రీమతి ప్రస్తావనే తేలేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. అసెంబ్లీలో వ్యవసాయం మీద చర్చ జరుగుతుంటే దానిపై మాట్లాడకుండా అనవసర మాటలతో రాద్దాంతం చేసింది చంద్రబాబేనని అంటూ నాని అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు సతీమణిని ఎవరైనా ఏమైనా అని ఉంటే ఆ ఫోన్‌ రికార్డును బయట పెట్టాలని పేర్ని నాని డిమాండ్‌ చేశారు. శాసనసభలో చంద్రబాబు తన అనుభవాన్ని రంగరించి మెలో డ్రామా సఅష్టించారన్నారు. రాజకీయాలను రాజకీయాలతోనే ఎదుర్కోవాలని సూచించారు. కుటుంబ మర్యాదను ...

Read More »

పేర్ని నాని కుటుంబ సభ్యులకు జ‌గ‌న్ ప‌రామ‌ర్శ

ఇటీవలే మాతృ వియోగం పొందిన రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఇంటికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు.  నాని మాతృమూర్తి నాగేశ్వరమ్మ అనారోగ్యంతో బాధపడుతూ గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మచిలీపట్నం వెళ్లారు.

Read More »

వారం రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ -పేర్ని నాని

కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు ఉధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆగస్టు 3 నుంచి 9 వరకు మచిలీపట్నంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘మచిలీపట్నంలో కరోనాను కట్టడి చేయడంలో భాగంగా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ అభిప్రాయం సేకరించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఉదయం 6 నుంచి 9 వరకు నిత్యావసరాలకు అనుమతిస్తున్నాం. మిగిలిన వ్యాపారాలన్నీ కూడా పూర్తిగా మూసివేయబడతాయి. బస్సులు, ఆటోలు, మోపెడ్‌లు రోడ్లపై తిరగ రాదు. అందరూ కూడా ...

Read More »

అనుచరుడి దారుణ హత్య..కన్నీటి పర్యంతమైన మంత్రి పేర్నినాని

అనుచరుడి దారుణ హత్య..కన్నీటి పర్యంతమైన మంత్రి పేర్నినాని

కృష్ణా జిల్లాలో హత్యకు గురైన వైసీపీ నేత, మాజీ మార్కెట్‌యార్డ్‌ ఛైర్మన్‌  మోకా భాస్కర్‌రావు భౌతికకాయాన్ని మంత్రి పేర్ని నాని సందర్శించారు. భాస్కర్‌రావు భౌతికకాయాన్ని చూడగానే మంత్రి కన్నీటి పర్యంతమయ్యారు. భాస్కర్‌ రావు మంత్రి పేర్ని నానికి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. భాస్కర్‌రావు హత్యకు గురయ్యారనే విషయం తెలియగానే నాని హుటాహుటిన మచిలీపట్నం చేరుకున్నారు. భాస్కర్‌ రావుపై మచిలీపట్నంలో ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆయన్ను ఆసుపత్రికి తరలించగా అక్కడ చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ...

Read More »

ప్రజా రవాణాపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పేర్ని నాని

ప్రజా రవాణాపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటారని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రాగానే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా బస్సు సర్వీసులను పునఃప్రారంభించేందుకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. రాష్ట్రాల మధ్య, రాష్ట్రం లోపల బస్సులు నడిపేందుకు అన్ని జాగ్రత్తలతో ఏర్పాట్లు చేశామని మంత్రి పేర్ని నాని తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర నిబంధనలు, రాష్ట్రంలో పరిస్థితుల అనుగుణంగా బస్సులు నడుపుతామని తెలిపారు.విజయవాడలో సోమవారం వైఎస్సార్‌ వాహనమిత్ర కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ...

Read More »

చంద్రబాబు పై ఫైర్ అయిన పేర్ని నాని

చంద్రబాబు పై ఫైర్ అయిన పేర్ని నాని

కరోనా పేరుతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. కరోనా వైరస్‌ రాష్ట్రంలో ఎక్కడ ప్రబలిందో బాబు చెప్పాలని ఆయన అడిగారు. చంద్రబాబు పొరుగు రాష్ట్రంలో విమర్శలు చేయడం సరికాదని అన్నారు. కరోనా వైరస్‌ నివారణకు తాము కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వైరస్‌ నివారణకు కర్ఫ్యూ, లాక్‌డౌన్‌తో పటిష్ట చర్యలు చేపడుతున్నామని అన్నారు.

Read More »

మానవత్వాన్ని చాటిన మంత్రి పేర్ని నాని

మానవత్వాన్ని చాటిన మంత్రి పేర్ని నాని

ఆంధ్రప్రదేశ్‌ రవాణా శాఖ మంత్రి పేర్నినాని మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తన కారులో ఆసుపత్రిలో చేర్పించారు. వివరాల్లోకి వెళితే..కృష్ణా జిల్లా నిమ్మకూరులో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మంత్రి కారులో ప్రయాణిస్తుండగా గాయపడిన వ్యక్తిని గమనించి.. తన కారులో మచిలీపట్టణం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను పేర్నినాని ఆదేశించారు.

Read More »

మార్చి 15 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు

మార్చి 15 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశానంతరం రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ, కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. మార్చి 15లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని తెలిపారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత 15 రోజుల్లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా చట్టంలో మార్పులు తీసుకువస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డబ్బు, ...

Read More »