Tag Archives: rajyasabha

రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు వైసీపీ అభ్యర్థులు

ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్సార్‌సీపీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో పోటీలేదని, వైసీపీ అభ్యర్థులవి మినహా ఇతరుల నామినేషన్లు దాఖలు కాలేదని రిటర్నింగ్ అధికారి, రాష్ట్ర శాసనసభ జాయింట్ సెక్రటరీ మంగళవారం ప్రకటించారు. ముగ్గురు అభ్యర్థులు గొల్ల బాబురావు, మేడా రఘునాథ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. మంగళవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిపోయింది. ఈ ముగ్గురు అభ్యర్థులకు పోటీ లేకపోవడంతో ఈ ప్రకటన చేశారు. కాగా నూతనంగా ఎన్నికైన ఈ ముగ్గురు ఎంపీలు సీఎం ...

Read More »

వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం..!

త్వరలో ఖాళీ అయ్యే 3 రాజ్యసభ స్థానాల్లో YCP అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నారు. నిన్న నామినేషన్ల పరిశీలనలో పత్రాలు సరిగ్గా లేకపోవడంతో ఓ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ను అధికారులు తిరస్కరించారు. వైసీపీ అభ్యర్థులు గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి నామినేషన్లను మాత్రమే ఆమోదించారు. ఈ నెల 20న వారి ఎన్నికపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Read More »

రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై చంద్రబాబు క్లారిటీ…

రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ నిర్ణయానికి వచ్చేశారు. బుధవారం ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో పలువురు పార్టీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసే అంశంపై అధినేత వద్ద నేతలు ప్రస్తావించారు. అయితే రాజ్యసభ ఎన్నికల్ల పోటీ చేసే ఆలోచన లేదని పార్టీ చీఫ్ తేల్చిచెప్పేశారు. ఈ మేరకు నేతలకు చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు. చంద్రబాబు నిర్ణయంతో రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండనుంది.

Read More »

రాజ్య సభకు మెగాస్టార్ చిరంజీవి…?

మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకునే ఈయన హీరోగా అనేక మంది అభిమానులను సంపాధించుకున్నాడు. కేవలం సినిమాల్లోనే కాకుండా గతంలో రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మళ్లీ రాజకీయాలకు దూరం అయ్యారు. అయితే తాజాగా మరోసారి ఈయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ.. మెగాస్టార్ చిరంజీవికి ఉత్తర్ ప్రదేశ్ ఎంపీగా స్థానం కల్పించాలని చూస్తోంది. ఇటీవలే అయోధ్యలో జరిగిన బాల ...

Read More »

పార్లమెంటులో ఆగని రైతు పోరు..

పార్లమెంటు ఉభయసభలూ బుధవారం నాడు కూడా రైతు సమస్యలపై దద్దరిల్లాయి. మోడీ ప్రభుత్వం రూపొందించిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రెండు సభల్లోనూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో లోక్‌సభ వాయిదాల బాట పట్టింది. రాజ్యసభ ఒకసారి వాయిదా పడింది. ఈ సభలో ఇద్దరు ఆప్‌ సభ్యులు సస్పెండ్‌కు గురయ్యారు. మధ్యాహ్నాం నాలుగు గంటలకు ప్రారంభమైన లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేబూని రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో ...

Read More »

రైతుల చట్టాలపై రాజ్యసభలో 15 గంటల పాటు చర్చ

మోడీ సర్కార్‌ ఏకపక్షంగా తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై 15 గంటల పాటు రాజ్యసభలో చర్చించేందుకు కేంద్రానికి, ప్రతిపక్షాల మధ్య సయోధ్య కుదిరింది. ఈ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశ రాజధాని హస్తినాలో రైతులు చేపడుతున్న ఆందోళనలను రెండు నెలలకు పైగా కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం ఉదయం ఎగువసభ ప్రారంభం కాగానే రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞతలు తెలుపుతూ చర్చ జరుగుతుండగా.. రైతుల ఆందోళనపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో అసహనానికి గురైన చైర్మన్‌ వెంకయ్యనాయుడు ముగ్గురు ఆప్‌ ఆద్మీ పార్టీ ఎంపిలను ...

Read More »

రాజ్యసభ బీఏసీ సభ్యుడిగా విజయసాయిరెడ్డి

రాజ్యసభ బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ సభ్యుడిగా వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. రాజ్యసభ సభ్యులు ప్రొఫెసర్‌ మనోజ్‌ కుమార్‌ ఝా, మల్లికార్జున్‌ ఖర్గే, శివ్‌ ప్రతాప్‌ శుక్లాలను బీసీఏ సభ్యులుగా రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు నామినేట్‌ చేశారు. సబార్డినేట్‌ లెజిస్లేచర్‌ కమిటీ సభ్యులుగా జీవీఎల్‌ నరసింహారావు, కె.ఆర్‌.సురేష్‌రెడ్డి నియమితులయ్యారు.

Read More »

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 17 రాష్ట్రాల నుంచి 55 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 4, తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. – మార్చి 6న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్‌ – నామినేషన్ల స్వీకరణకు మార్చి 13న తుదిగడువు – మార్చి 16న రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన – నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 18 తుది గడువు – మార్చి 26న రాజ్యసభ ...

Read More »