Tag Archives: Richa Gangopadhyay

తల్లి కాబోతున్న హీరోయిన్‌ రిచా

హీరోయిన్‌ రిచా గంగోపాధ్యారు తల్లి కాబోతున్నారు. బేబీ బంప్‌తో ఆదివారం ఉదయం ట్విటర్‌ వేదికగా చిత్రాన్ని షేర్‌ చేసుకున్నారు. జూన్‌లో తమ కుటుంబంలోకి ఓ చిన్నారి రానుంది అంటూ ట్వీట్‌ చేశారు. అలాగే తామెంతో సంతోషంగా ఉన్నామని తెలిపారు. తమ చిన్నారి కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని వెల్లడించారు. లీడర్‌ చిత్రం ద్వారా ఆమె తెలుగు తెరకు పరిచయమయ్యారు. మిర్చి చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆమె అక్కడ బిజినెస్‌ స్కూల్లో జోను ప్రేమించారు. అనంతరం వివాహం చేసుకుకున్నారు.

Read More »

ప్రభాస్ గురించి మనసులో మాట బయటపెట్టిన మిర్చి హీరోయిన్

ప్రభాస్ , అనుష్క, రిచా గంగోపాధ్యాయ కలిసి నటించిన సినిమా ‘మిర్చి‌’. ఈ సినిమాను ప్రభాస్ అభిమానులెవరూ మర్చిపోలేరు. అందుకే 2013లో వచ్చిన ఈ సినిమాకు ఏడేళ్లు గడుస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఏదో ఓ సందర్భంలో మిర్చీ టాపిక్ తీసుకు వస్తూనే ఉంటారు. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్‌తో కలిసి నటించిన రిచా సోషల్ మీడియాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. పెళ్లి చేసుకున్నాక తొలిసారిగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో ఆమెను ప్రభాస్ అభిమానులు చుట్టుముట్టారు. తాజాగా ‘మిర్చి’ నటి రిచా గంగోపాధ్యాయ ఓ ట్వీట్‌ చేశారు. ...

Read More »