Tag Archives: Shivaratri

మహాశివరాత్రి నాడు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. ఈ పర్వదినాన ఉపవాసం, జాగరణ చేయడం వల్ల పరమేశ్వరుడు ప్రసన్నం అవుతాడని నమ్ముతారు. అందుకే శివరాత్రి నాడు నిష్టతో ముక్కంటిని ఆరాధిస్తారు. ఓం నమఃశివాయ అని స్మరింస్తూ పగలంతా ఉపవాస దీక్షలో.. సాయంత్రం దైవ చింతలో మునిగిపోతారు. అయితే శివానుగ్రహం కోసం చేసే ఈ దీక్ష సమయంలో చాలా నిష్టగా ఉండటంతో పాటు కొన్ని నియమాలను పాటించాలి. అప్పుడే కోరిన కోర్కెలు నెరవేరతాయి. తెలిసీ తెలియక చేసే కొన్ని తప్పుల కారణంగా ఉపవాసం ఉన్న ఫలం కూడా ...

Read More »

శ్రీశైలంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు..

ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. 4 వ రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లి కార్జునస్వామి మయూర వాహనం పై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయం విద్యుత్ దీపకాంతులతో భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో మయూర వాహనంలో ఆవహింపజేసి అర్చకస్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులు విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నులపండువగా ఉంది. ...

Read More »

శివరాత్రి రోజు శివలింగాన్ని ఎందుకు పూజిస్తారు..?

మహాశివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శివ భక్తులందరూ, ఎంతో ఇష్టంగా ఉపవాసం ఉంటూ శివయ్యను పూజిస్తారు. ఇక మార్చి8న శివరాత్రి జరుపుకోనున్నారు. ఆరోజు ప్రతి దేవాలయం భక్తులతో నిండి ఉంటుంది. శివనామస్మరణతో ఎంతో నిష్టగా భక్తులు శివయ్యను కొలుచుకుంటారు. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా? శివరాత్రి రోజున శివలింగాన్ని పూజిస్తుంటారు. మరి మీకు ఎప్పుడున్న డౌట్ వచ్చిందా అసలు శివరాత్రి రోజున శివలివంగాన్ని ఎందుకు పూజిస్తారు. శివయ్యకు శివలింగానికి మధ్య సంబంధం ఏమిటి ? కాగా దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా శివాలయాల్లో ...

Read More »

నేటినుంచి శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు

నేటినుంచి శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలం క్షేత్రంలో శుక్రవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయని ఆలయ ఈవో కేఎస్‌ రామారావు తెలిపారు. 14వ తేదీ నుంచి 24 వరకు ఉత్సవాలకు వివిధ రాష్ర్టాల నుంచి వచ్చే భక్తులకు అవసరమైన వసతులు కల్పించినట్టు పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ దర్శన వేళల్లో మార్పులు, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. భక్తుల రాకపోకలకు వీలుగా 18 నుంచి 22వ తేదీ వరకు మన్ననూర్‌ అటవీ ప్రాంతంలో రాత్రి వేళలో రాకపోకలకు ఉన్న ఆంక్షలు తొలగించనున్నట్టు చెప్పారు.

Read More »