Tag Archives: sonia gandhi

సోనియా గాంధీకి MLC కవిత లేఖ

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. ఈ విషయాన్ని స్వయంగా కవిత సోషల్ మీడియా వేదికగా తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలను నమ్మి ప్రజలు, విద్యార్థులు అధికారం కట్టబెట్టారని అన్నారు. అధికారంలోకి రాగానే ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా వచ్చిన ఆడబిడ్డల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని లేఖలో పేర్కొన్నారు. ‘‘1996లో అనేక పోరాటాల ఫలితంగా మహిళలకు ఉపాధి అవకాశాల్లో 33.3 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నాటి ప్రభుత్వం ...

Read More »

సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని.. ఏకగ్రీవ తీర్మానం చేశామన్న రేవంత్ రెడ్డి

తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని తాము ఏకగ్రీవ తీర్మానం చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారా? అని ప్రశ్నించారు. దానికి ముఖ్యమంత్రి పైవిధంగా స్పందించారు. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని మాత్రమే తాము తీర్మానం చేశామని… దానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. సోనియా గాంధీ తెలంగాణ నుంచి నామినేషన్ వేస్తే ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని తెలంగాణ ప్రజలకు ...

Read More »

సోనియాగాంధీ, చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు

ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ చేసిన ద్రోహానికి… ఆమెను రాష్ట్ర ప్రజలెవరూ క్షమించరని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రానికి ఆమె చేసిన ద్రోహాన్ని తరతరాలు గుర్తు పెట్టుకుంటారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కలిసిపోయిందని అన్నారు. సీఎం జగన్ తోనే సామాజిక న్యాయం సాధ్యమని చెప్పారు. వెనుకబడిన వర్గాలను చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని అన్నారు. రానున్న ఎన్నికలు ధనికులకు, పేదవారికి మధ్య జరిగే రెఫరెండమని విజయసాయి చెప్పారు. ఎన్నికల యుద్ధంలో ఎస్సీ, ...

Read More »

సోనియాపై విరుచుకుపడిన బిజెపి

రాష్ట్రపతి అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ గురువారం పార్లమెంటు దద్దరిల్లింది. ద్రౌపది ముర్ముని అగౌరవపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బిజెపి సభ్యులు నిరసనకు దిగారు. ‘రాష్ట్రపత్ని’ అంటూ ఆ పదవిని లోక్‌సభ ప్రతిపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి అవమాన పరిచారని, కాంగ్రెస్‌ క్షమాపణలు చెప్పాలని కేంద్రమంత్రి  స్మృతి ఇరానీ డిమాండ్‌ చేశారు. అత్యున్నత పదవిలో ఉన్న ఒక మహిళను అవమాన పరిచారంటూ మండిపడ్డారు. నిర్మలా సీతారామన్‌ సహా పలువురు బిజెపి మహిళా నేతలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ నాటకీయ పరిణామాలతో గురువారం ...

Read More »

సోనియాగాంధీతో కోమటిరెడ్డి భేటీ

సోనియాగాంధీతో కోమటిరెడ్డి భేటీ

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఆ పార్టీ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. సోనియా పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన కోమటిరెడ్డి.. గురువారం ఉదయం ఆమెతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయాలపై కీలక చర్చ జరిగినట్లు సమాచారం. కాగా, త్వరలో కొత్త పీసీసీ అధ్యక్షుడి ప్రకటన ఉంటుదన్న నేపథ్యంలో సోనియాను కోమటిరెడ్డి కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడి రేసులో తాను ఉన్నానని కోమటిరెడ్డి ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలో కాంగ్రెస్ అధ్యక్షురాలు ...

Read More »