Tag Archives: telangana lockdown

తెలంగాణాలో రేపటి నుండి లాక్‌డౌన్‌

కరోనా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బుధవారం నుండి 10 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించింది. లాక్‌డౌన్‌ సమయంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే నిత్యావసరాల, ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు అవకాశమిచ్చింది. అనంతరం అత్యవసర సేవలు మినహాయించి మిగిలిన సేవలన్నీ నిలిచిపోతున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలు అమలు అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆదేశించారు.

Read More »

తెలంగాణలో మే 28 వరకు లాక్‌డౌన్.. కేసీఆర్ సర్కారు సంకేతాలు!

తెలంగాణలో మే 28 వరకు లాక్‌డౌన్..

తెలంగాణలో మే 28 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం ఉందని సమాచారం. మంగళవారం జరగనున్న కేబినెట్ భేటీలో ఈ విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. మే నెలాఖరు వరకు లాక్‌డౌన్ పొడిగిస్తేనే ఫలితం ఉంటుందని ఆరోగ్య శాఖ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. కరోనాను కట్టడి చేయడం కోసం 70 రోజుల లాక్‌డౌన్ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మే 28వ తేదీతో రాష్ట్రంలో 70 రోజుల సైకిల్ పూర్తవుతుందని.. అందుకే ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ను పొడిగించొచ్చనే భావన ...

Read More »