Tag Archives: YS Jagan

జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు

రక్షాబంధన్‌ సందర్భంగా సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి​కి హోంమంత్రి తానేటి వనిత, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌ అక్రమాని విజయనిర్మల, రుడా చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిలారెడ్డి, మహిళా కమిషన్‌ సభ్యులు కర్రి జయశ్రీ, గెడ్డం ఉమ రాఖీలు కట్టారు.

Read More »

హజ్రత్‌ ఇమామ్‌ హుస్సేన్‌ జీవితం అందరికీ ఆదర్శం : జగన్‌

త్యాగానికి, ధర్మ పరిరక్షణకు మొహర్రం ఒక ప్రతీక అని ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి తెలిపారు. మొహర్రం సందర్భంగా ముస్లింలకు సిఎం జగన్‌ ఒక సందేశాన్ని విడుదల చేశారు. మహమ్మద్‌ ప్రవక్త మనవడు హజ్రత్‌ ఇమామ్‌ హుస్సేన్‌ బలిదానానికి మొహర్రం ప్రతీక అని చెప్పారు. నమ్మిన సిద్ధాంతం కోసం కష్టనష్టాలను భరించి, ఆత్మ బలిదానానికి కూడా సిద్ధపడిన హుస్సేన్‌ జీవితం అందరికీ ఆదర్శమన్నారు. పవిత్రమైన ఈ మొహర్రం సంతాప దినాలు రాష్ట్రంలో మత సమైక్యతకు ప్రతీకగా నిలుస్తాయని చెప్పారు.

Read More »

గ్యాస్‌ లీక్‌పై జగన్‌ సీరియస్‌

అచ్యుతాపురం సెజ్‌లో విషవాయువు లీకైన ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌ సీరియస్‌ అయ్యారు. విషవాయువు లీక్‌ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి కారణాలను వెలికితీయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్‌ జరిపించాలని భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపైనా దృష్టిపెట్టాలని తెలిపారు. మరోవైపు విషవాయువు లీకైన సెజ్‌లోని సీడ్స్‌ కంపెనీని మంత్రి అమర్నాథ్‌ పరిశీలించారు. ప్రమాదంపై నివేదిక వచ్చే వరకు కంపెనీని మూసివేయాలని యాజమాన్యాన్ని ...

Read More »

ఘనంగా పింగళి వెంకయ్య జయంతి వేడుకలు

ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. వేడుకల్లో భాగంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద సీఎం జగన్‌.. జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం పింగళి వెంకయ్య జీవితంపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. కాగా.. చిత్తూరు జిల్లా నగరిలో జరిగే కార్యక్రమంలో ...

Read More »

జగన్‌ను కలిసిన జాహ్నవి దంగేటి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి బుధవారం కలిశారు. నాసా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి ఇండియన్‌గా జాహ్నవి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ నుంచి వరద బాధితులను పరామర్శించేందుకు బయలుదేరుతున్న ముఖ్యమంత్రిని కలిసి.. పైలెట్‌ ఆస్ట్రొనాట్‌ అవ్వాలన్న తన కోరికను వివరించి, ఇందుకు అవసరమైన శిక్షణకు అయ్యే ఖర్చుకు సాయం చేయాల్సిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు.

Read More »

 జోరు వానలోనూ ఆగని అడుగు.. జనం కోసం జగనన్న

 ఉదయం కోనసీమ జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు సీఎం జగన్‌. దీనిలో భాగంగా జి.పెదపూడికి సీఎం జగన్‌ చేరుకునే సరికి భారీ వర్షం కురుస్తోంది. కానీ సీఎం జగన్‌ భారీ వర్షంలోనూ ముందుకు సాగారు. వరద బాధితులకు వద్దకు వెళ్లి వారి కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు.  కచ్చితంగా వరద బాధితులతో మాట్లాడాలనే తాపత్రయమే సీఎం జగన్‌లో కన్పిస్తోంది. తాను వారిని కలుస్తానని ముందుగా మాటిచ్చిన మేరకే వారి కష్టాలను స్వయంగా తెలుసుకుని భరోసా ఇస్తున్నారు. సాధారణంగా వాతావరణం అనుకూలంగా లేనప్పుడు సీఎం స్థాయి వ్యక్తి ...

Read More »

వర్షాలు, వరదలపై జగన్‌ సమీక్ష

రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా గోదావరి ఉధృతి, వరద సహాయక చర్యలపై సీఎం జగన్‌ దిశనిర్దేశం చేశారు. జగన్‌ మాట్లాడుతూ.. గోదావరికి ముందస్తుగానే వరదలు వచ్చాయన్నారు. జులై మాసంలోనే 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చిందని, ఇప్పడు రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తోందన్నారు. బుధవారం ఉదయానికి వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. 16 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందన్న సీఎం జగన్‌.. దీనివల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ...

Read More »

బాబును ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర ప్రజలదే: జగన్‌

చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లేనని, సంక్షేమ పథకాలను కాపాడుకునే బాధ్యత ప్రజలదేనని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాల్లో భాగంగా రెండో రోజైన శనివారం పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైన సీఎం జగన్‌ ప్రజలనుద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. చంద్రబాబును ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర ప్రజలదేనని, తనకున్న ఏకైక అండాదండా ప్రజలేనని మరోసారి స్పష్టం చేశారు సీఎం జగన్‌. ‘చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పధకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లే. చక్రాలు లేని సైకిల్‌ను చంద్రబాబు తొక్కలేకపోతున్నారు. రాష్ట్రంలో అందరికీ న్యాయం చేసేందుకే మూడు రాజధానులు.  ...

Read More »

పార్టీ జెండాను గుండెగా మార్చుకున్న యోధులకు నా సెల్యూట్‌

13 ఏళ్ల క్రితం పావురాల గుట్టలో ప్రారంభమైన ఈ సంఘర్షణలో.. నాన్న గారి ఆశయాల సాధన కోసం, మనందరి ఆత్మాభిమానం కోసం, అవమానాలను సహించి, కష్టాలను భరించి, నన్ను అమితంగా ప్రేమించి ఈ ప్రయాణంలో నాతో నిలబడి, వెన్నుదన్నుగా నిలిచి.. మన పార్టీ జెండా తమ గుండెగా మార్చుకున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ యోధులకు, కోట్లమంది మనసున్న మనుషులకు మీ జగన్‌ ప్రేమ పూర్వకంగా, హృదయపూర్వకంగా, కృతజ్ఞతా పూర్వకంగా, మీ వాడిగా, మీ ఆప్తుడిగా, మీ కుటుంబ సభ్యులుగా సెల్యూట్‌ చేస్తున్నా’’ అని వైయస్‌ఆర్‌ ...

Read More »

జగన్‌ను చూసి గర్వపడుతున్నా..వైయ‌స్‌ విజయమ్మ

మీ అందరి ప్రేమ సంపాదించిన వైయ‌స్ జగన్‌ను చూసి గర్వపడుతున్నా..అని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయ‌స్‌ విజయమ్మ అన్నారు. నా బిడ్డను నడిపించుకోమని మీకే అప్పజెప్పా. నా బిడ్డను నడిపించిన మీ అందరిపైనా నా అణువణువునా కృతజ్ఞత ఉంది.  మీ బిడ్డల్ని వైయ‌స్ జగన్‌ చేతుల్లో పెట్టండి, వారికి ఉజ్వల భవిష్యత్‌ అందిస్తార‌ని చెప్పారు. మీతో నా అనుబంధం ఈనాటిది కాదు, 45 ఏళ్ల​ అనుబంధం ఉంది. ఇకపైనా ఈ అనుబంధం కొనసాగాలి అంటూ వైయ‌స్‌ విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు.

Read More »