Tag Archives: YS Jagan

కరోనా కాటుకు కుల, మత బేధాల్లేవు: సీఎం జగన్‌

కరోనా కాటుకు కుల, మత బేధాల్లేవు

ఢిల్లీలోని మర్కజ్‌ సమావేశానికి వెళ్లిన వారిలో ఎక్కువ మందికి కరోనా వైరస్‌ సోకడం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కరోనా కాటుకు కుల, మత, ప్రాంత బేధాలు లేవని, అందరు కలిసి ఐక్యంగా యుద్దం చేస్తేనే ఈ మహమ్మారిని తరిమేయడం సాధ్యమవుతుందన్నారు. కరోనా సృష్టిస్తున్న విపత్కర పరిస్థితిలో సీఎం జగన్‌ శనివారం రాష్ట్ర ప్రజలకు వీడియో సందేశాన్ని ఇచ్చారు. భౌతిక దూరం పాటిస్తూ కరోనాపై పోరాటం చేయాలని కోరారు. ‘ఢిల్లీలో జరిగిన ఒక సమావేశానికి అనేక దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. ...

Read More »

కరోనా సోకినా వారిపై వివక్షత చూపవద్దు -సీఎం జగన్

కరోనా సోకినా వారిపై వివక్షత చూపవద్దు -సీఎం జగన్

కరోనా వైరస్‌ లక్షణాలు గుర్తించి వైద్యం అందించడంలో సమగ్ర విధానం అవలంభిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రెండు రోజులుగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడం బాధ కలిగిస్తోందన్నారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతి ఒక్కరినీ, వారితో కాంటాక్టులో ఉన్నవారినీ గుర్తిస్తున్నామని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. వైరస్‌ వస్తే ఏదో జరిగిపోతుందని అనుకోవద్దన్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వైరస్‌ను అరికట్టవచ్చని చెప్పారు. వయసు మళ్లినవారిలో ...

Read More »

గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ

గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసకుంటున్న చర్యలను, లాక్‌డౌన్‌ పరిస్థితులను సీఎం జగన్‌ ఈ సందర్భంగా గవర్నర్‌కు వివరించారు. కరోనా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా గవర్నర్‌ కార్యాలయంలోకి వెళ్లే ముందు సీఎం వైఎస్‌ జగన్‌ శానిటైజర్‌తో తన చేతులను శుభ్రం చేసుకున్నారు. అలాగే సమావేశంలో కూడా గవర్నర్‌, సీఎం జగన్‌లు సామాజిక దూరం పాటించారు.

Read More »

కలెక్టర్లు, ఎస్పీలతో జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

కలెక్టర్లు, ఎస్పీలతో జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ అమలు, నిత్యావసర సరుకులు అందుబాటు, రేషన్‌ సరఫరా తదితర కీలక అంశాలపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.అలాగే కరోనా వైరస్‌ వ్యాప్తి, నివారణ చర్యలపై సమీక్ష జరిపారు. ఇక లాక్‌డౌన్‌ వెలుసుబాటు సమయాన్ని తగ్గించిన నేపథ్యంలో అమలు అవుతున్న తీరుపై సీఎం జగన్‌ సమీక్షించారు. అంతరాష్ట్ర సరిహద్దులు ఉన్న జిల్లాల్లో తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి చర్చించారు.

Read More »

జగన్ కి లేఖ రాసిన సిపిఐ రామకృష్ణ

జగన్ కి లేఖ రాసిన సిపిఐ రామకృష్ణ

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. కరోనా విపత్తు వల్ల లాక్‌డౌన్ నేపథ్యంలో తొలగించిన కార్డు దారులకు కూడా రేషన్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ పంపిణీలో చౌకడిపోల వద్ద ప్రజలకు పలు సమస్యలు ఎదురవుతున్నాయని తెలియజేశారు. వ్యక్తిగత దూరం పాటించకుండా వందల సంఖ్యలో రేషన్ దార్లు క్యూలైన్లో ఉంటున్నారని రామకృష్ణ పేర్కొన్నారు.

Read More »

సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పేర్ని నాని

మచిలిపట్నంలో మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినందుకు బందరు ప్రజల తరపున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంత్రి పేర్ని నాని కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి తన చర్మం వలిచి చెప్పులు కుట్టించినా రుణం తీర్చుకోలేనన్నారు. బందరులో ఏర్పాటు చేయబోయే కళాశాలకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మెడికల్‌ కాలేజీగా నామకరణం చేయబోతున్నామని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన పదినెలలలోపే కార్యరూపం దాల్చే విధంగా సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మచిలిపట్నం ప్రజల కలను నిజం చేసిన సీఎం జగన్‌కు ...

Read More »

జగన్ సర్కార్ అదిరే ట్విస్ట్.. సీఎస్‌తో ఈసీకి చెక్!

జగన్ సర్కార్ అదిరే ట్విస్ట్.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి నడుస్తోంది. ఆరు వారాల పాటూ ఎన్నికల ప్రక్రియ వాయిదా వేస్తూ ఏపీ ఎన్నికల అధికారి రమేష్ కుమార్ నిర్ణయం తర్వాత రాజకీయ దుమారం రేగింది. జగన్ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉందనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఇవాళ గవర్నర్‌ను రమేష్ కుమార్ కలవబోతున్నారు.. ఎన్నికల వాయిదాకు కారణాలు వివరించనున్నారు. ఇలాంటి సమయంలోనే సీఎస్ నీలం సాహ్ని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.. తమను సంప్రదించే ఉంటే కరోనా పరిస్థితిపై సరైన సమాచారం ఇచ్చేవాళ్లమని లేఖలో సీఎస్ ప్రస్తావించారు. స్థానికంగా ...

Read More »

వైసీపీ లో చేరిన డొక్కా మాణిక్య వర ప్రసాద్

టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్యా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం మధ్యాహ్నం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ చేరికకు తాడేపల్లిలోని జగన్ నివాసం వేదికైంది. ఈ సందర్భంగా డొక్కాకు వైసీపీ కండువా కప్పిన జగన్.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Read More »

కరోనా వైరస్ పై అధికారులతో సీఎం జగన్ సమీక్ష

కరోనా వైరస్ పై అధికారులతో సీఎం జగన్ సమీక్ష

రాష్ట్రంలో కరోనా వైరస్‌(కోవిడ్‌-19) నిరోధంకు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కీలక సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, సీఎం కార్యాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్‌లతోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా వ్యాపించకుండా తీసుకుంటున్న ముందస్తు చర్యలను ఈ సందర్భంగా అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు. దీనిపై సీఎం జగన్‌ స్పందిస్తూ.. ప్రజలను ఆందోళనకు గురిచేయాల్సిన అవసరం ...

Read More »

కేబినెట్ భేటీలో మంత్రులతో జగన్ ఆసక్తికర చర్చ!

కేబినెట్ భేటీలో మంత్రులతో జగన్ ఆసక్తికర చర్చ!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ భేటీ తర్వాత సీఎం జగన్.. మంత్రులకు పలు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దిశా నిర్దేశం చేశారట. ఈ నెలలోనే ఎన్నికలు జరగనుండటంతో.. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారట. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవ్వాలని మంత్రులను ముఖ్యమంత్రి ఆదేశించారట. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వ్యూహాలు సిద్ధం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చుక్క మద్యం, ఒక్క రూపాయి ...

Read More »