Tag Archives: ysrcp

సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన విజయవాడ, విశాఖ జనసేన నేతలు

ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనుండగా, ప్రధాన పార్టీల్లో వలసలు, చేరికలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా, విజయవాడ జనసేన నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జనసేన పార్టీ విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి బత్తిన రాము నేడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదర ఆహ్వానం పలికారు. విజయవాడకు చెందిన మాజీ కార్పొరేటర్లు గండూరి మహేశ్, సందెపు జగదీశ్, మాజీ కోఆప్షన్ మెంబర్ కొక్కిలిగడ్డ దేవమణి తదితరులు ...

Read More »

అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాలనాయుడు

అనకాపల్లి లోక్ సభ స్థానానికి అభ్యర్థిని వైసీపీ ప్రకటించింది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడిని బరిలోకి దించింది. ఇప్పటి వరకు వైసీపీ 175 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాలను ప్రకటించింది. అనకాపల్లి ఎంపీ సీటును మాత్రమే పెండింగ్ లో ఉంచింది. ఇప్పుడు ఈ స్థానంలో ముత్యాలనాయుడిని నిలబెట్టారు. ముత్యాలనాయుడు ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను ఇప్పుడు అనకాపల్లి ఎంపీ స్థానానికి మార్చారు. మాడుగుల ఎమ్మెల్యే టికెట్ ను ఈర్లి అనురాధకు ఇచ్చారు. ముత్యాలనాయుడు కూతురే అనురాధ. బూడి ముత్యాలనాయుడు కొప్పుల వెలమ ...

Read More »

సీఎం జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర..

పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. మరోసారి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుని అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 27న వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రచార భేరి మోగించనున్నారు. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద నివాళులు అర్పించి.. ఎన్నికల సంగ్రామానికి ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు దాదాపు 21 రోజులపాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ఇక, పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి ...

Read More »

వైసీపీలో చేరిన 2 వేల టీడీపీ కుటుంబాలు..

కడప జిల్లా వేంపల్లిలో టీడీపీ నుంచి వైసీపీలోకి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరారు. వైసీపీ నేత సతీశ్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 2 వేల కుటుంబాలు చేరాయి. ఈ కార్యక్రమంలో వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పాల్గొన్నారు. వీరందరికీ అవినాశ్ రెడ్డి పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవినాశ్ రెడ్డి మాట్లాడుతూ… ఈరోజు నుంచి ప్రతిరోజు వైసీపీలోకి భారీగా చేరికలు ఉంటాయని చెప్పారు. పులివెందుల నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి చేరికలు ఉంటాయని తెలిపారు. పార్టీలోకి వచ్చే ...

Read More »

చంద్రబాబు ఎవరినైనా గుంజుకోవాలంటే డబ్బు వెదజల్లుతాడు: విజయసాయిరెడ్డి

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈసారి ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఆయనకు ఇదే ప్రథమం. ఆయన నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తే. నెల్లూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తుండడంతో, తన పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల స్థితిగతులపై దృష్టి సారించారు. ఇటీవల కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాలరెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనను ఉద్దేశించి విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు. “చంద్రబాబు మానిప్యులేషన్స్ ...

Read More »

ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన సీఎం జగన్‌..మరో విజయం అంటూ !

ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన సీఎం జగన్‌..మరో విజయం అంటూ ట్వీట్‌ చేశారు. హోలీ పండుగ నేపథ్యంలో సీఎం జగన్‌ ఈ పోస్ట్‌ పెట్టారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ. ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటున్నాను….అందరికీ హోలీ శుభాకాంక్షలు అన్నారు సీఎం జగన్‌.

Read More »

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిపై MP విజయసాయిరెడ్డి ఫైర్

టీడీపీ-జనసేన-బీజేపీల కూటమిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు జనసేన నేతలు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో కుల, మతతత్వ పార్టీలు అన్ని ఒక్కటయ్యాయని అన్నారు. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి భవిష్యత్ లేదని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఎంపీ అభ్యర్థి దొరకలేదని.. ...

Read More »

సినిమా వాళ్లకు రాజకీయాలెందుకు?: పవన్ పై ముద్రగడ ఫైర్

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇటీవల వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. మీడియాతో మాట్లాడుతూ ముద్రగడ… జనసేనాని పవన్ కల్యాణ్ పై ధ్వజమెత్తారు. సినిమా వాళ్లకు రాజకీయాలెందుకు? అని ఎత్తిపొడిచారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి కొద్దికాలంలోనే జెండా ఎత్తేశారని, పవన్ కల్యాణ్ కూడా అందుకు మినహాయింపు కాదని అన్నారు. సినిమా వాళ్లు రాజకీయాలకు పనికిరారని అభిప్రాయపడ్డారు. మా ఇంటికొస్తే ఏం తెస్తారు… మీ ఇంటికి వస్తే ఏమిస్తారు?… అన్న చందంగా సినిమా వాళ్ల వ్యవహారం అంతా ఇలాగే ఉంటుందని వ్యంగ్యం ...

Read More »

ఏపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్.. ఒకేసారి చంద్రబాబు, జగన్ ప్రచారం ప్రారంభం

ఏపీలో పొలిటికల్ హీట్ రానురాను పెరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకే రోజు తమ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. మార్చి 27న ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఇద్దరు నేతలూ రాయలసీమలోని తమ సొంత నియోజకవర్గాల నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను దాదాపుగా పూర్తి చేశాయి. దీంతో, ప్రధాన పార్టీల ఫోకస్ ప్రచారం వైపు మళ్లింది. ఎల్లుండి నుంచి సీఎం జగన్, చంద్రబాబు ...

Read More »

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏప్రిల్‌ 2, 3 తేదీల్లో బస్సు యాత్ర

ఈ నెల 27న మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభమవుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వచ్చే నెల 2, 3, తేదీల్లో బస్సు యాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. మూడో తేదీ సాయంత్రం తిరుపతి పార్లమెంట్ పరిధిలో బస్సు యాత్ర ప్రారంభమవుతుందని, తిరుపతి పార్లమెంట్ పరిధిలో శ్రీకాళహస్తి, నాయుడుపేటలో బహిరంగ సభలు ఉంటాయని తెలిపారు.

Read More »