Tag Archives: ysrcp

చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి: వైఎస్ అవినాశ్ రెడ్డి

అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వకుండా టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుపడ్డారని కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి విమర్శించారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్నారని అన్నారు. మండుటెండల్లో పెన్షన్ల కోసం వెళ్లిన పలువురు మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్న చంద్రబాబును ప్రజలు సస్పెండ్ చేయాలని అన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే నేతలు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. కూటమి పేరుతో ఇతర పార్టీలను కూడగట్టుకుని చంద్రబాబు వస్తున్నారని అవినాశ్ అన్నారు. రంగురంగుల మేనిఫెస్టోతో ఇప్పుడు ఎన్నికలకు ...

Read More »

వాలంటీర్ వ్యవస్థను ఎవ్వరూ ఏం చేయలేరు : సజ్జల

ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న కారణంగా వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయించొద్దని రీసెంట్ గా ఈసీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఏపీలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే 400 మంది రాజీనామా చేసినట్లు సమాచారం. అయితే ఈ ఇష్యూపై తాజాగా ఏపీ రాష్ట్ర సలహా దారుడు సజ్జల స్పందించి.. ‘‘వాలంటీర్లపై కావాలనే టీడీపీ రాద్ధాంతం చేస్తోంది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. వాలంటీర్లపై చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ వృద్ధులు ఎండల్లో ...

Read More »

పవన్ ది పిరికితనం, చేతకానితనం : ముద్రగడ విమర్శలు

వైసీపీలో చేరినప్పటి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కాపు నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పవన్ ను ముద్రగడ మరోసారి టార్గెట్ చేశారు. పార్టీ కార్యకర్తలను పవన్ కనీసం దగ్గరకు కూడా రానివ్వరని ఆయన అన్నారు. పవన్ చుట్టూ ఎప్పుడూ బౌన్సర్లు ఉంటారని… రోజుకు మూడు షిఫ్టుల్లో బౌన్సర్లు పని చేస్తారని చెప్పారు. అలాంటి పవన్ వైసీపీ నేతలను బ్లేడ్ బ్యాచ్ అని వ్యాఖ్యానించడం హాస్యాస్పదం అని అన్నారు. పిరికితనం, చేతకానితనంతోనే పవన్ ...

Read More »

ప్రాణం పోయేవరకు జగన్ వెంటే ఉంటా – విజయసాయిరెడ్డి

నెల్లూరులోనే నిత్యం ఉంటా..ప్రాణం పోయేవరకు జగన్ వెంటే ఉంటానని నెల్లూరు వైసీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. నేను గెలిస్తే ఢిల్లీకి ఎక్స్ పోర్ట్ అవుతానంట… నెల్లూరును పట్టించుకోనని వేమిరెడ్డి గారు ఛలోక్తులు విసురుతున్నారని ఆగ్రహించారు నెల్లూరు వైసీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయ సాయిరెడ్డి. ఎక్స్‌పోర్ట్‌, ఇంపోర్ట్‌ బిజినెస్‌లు చేస్తున్నందు వలన అలవాటు ప్రకారం ఆయన ఆ పదం వాడి ఉంటారని తెలిపారు. నాకు ఏ వ్యాపారాలు లేవు. పార్లమెంటు సమావేశాలప్పుడు తప్ప మిగిలిన రోజులు నెల్లూరులోనే ఉంటా. ప్రాణం ...

Read More »

నేడు వైసీపీ రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం

వైసీపీ రాజ్యసభ సభ్యులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గొల్ల బాబూరావు, మేడా రఘునాథ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. వీరితో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఇఖడ్ ప్రమాణం చేయించనున్నారు. కాగా రాజ్యసభలో ఏపీకి ఉన్న 11 సీట్లు వైసీపీ ఖాతాలోకి వెళ్లాయి. తొలిసారి ఎగువ సభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది.

Read More »

పూతలపట్టు సభలో సీఎం జగన్ కు పాదాభివందనం చేసిన మంత్రి రోజా

ఏపీ సీఎం జగన్ ఇవాళ చిత్తూరు జిల్లా పూతలపట్టులో మేమంతా సిద్ధం సభకు హాజరయ్యారు. ఈ సభలో మంత్రి రోజా కూడా పాల్గొన్నారు. తన ప్రసంగం సందర్భంగా సీఎం జగన్… నగరి నుంచి రోజమ్మ పోటీ చేస్తోంది… నా చెల్లెలు అని వ్యాఖ్యానించారు. మీ చల్లని దీవెనలు నా చెల్లిపై ఉండాలని సవినయంగా మీ అందరినీ ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాదు, మంత్రి రోజా తలపై చేయి ఉంచి దీవించారు. జగన్ మాటలతో రోజా ఆనందంతో పొంగిపోయారు. వెంటనే ఆయన పాదాలకు నమస్కరించారు. దీనికి సంబంధించిన ...

Read More »

పెన్షన్లపై చంద్రబాబు దొంగ నాటకాలు: పేర్ని నాని

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెన్షన్లపై దొంగ నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు పేదలపై ప్రేమ ఇప్పుడొచ్చిందా అని మండిపడ్డారు. గతంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎగ్గొట్టారని విమర్శించారు. బాబు ఏనాడు సచివాలయం గుమ్మం తొక్కలేదని దుయ్యబట్టారు. ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షన్లు ఇచ్చిన ఘన చరిత్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదని కొనియాడారు. 2019 ఎన్నికల సమయంలో రైతుకు జన్మభూమి కమిటీ ద్వారా డబ్బులు పంచుతున్నా తము అడ్డుకోలేదన్నారు పేర్ని నాని. జన్మభూమి కమిటీల ద్వారా ...

Read More »

ప్రచారంలో విడదల రజినీ దూకుడు..

ప్రచారంలో విడదల రజినీ దూకుడు..పెంచారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డితో మాత్ర‌మే మ‌న ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో న్యాయం జ‌రుగుతుంద‌నే విష‌యాన్ని ఈ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్ర‌జ‌లంతా న‌మ్ముతున్నార‌ని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని గారు తెలిపారు. గుంటూరు అమ‌రావ‌తి రోడ్డు, పోస్ట‌ల్ కాల‌నీలో దాదాపు 100 మందికిపైగా బీఎస్సీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరారు. బీఎస్సీ న‌గ‌ర అధ్య‌క్షుడు చింతా రాంప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్రమాన్ని నిర్వ‌హించారు.

Read More »

మదనపల్లిలో చంద్రబాబుపై సీఎం జగన్ సెటైర్లు

టీడీపీ చీఫ్ చంద్రబాబుపై సీఎం జగన్ సెటైర్లు వేశారు. మంగళవారం మదనపల్లిలో వైసీపీ నిర్వహించిన భారీ బహిరంగా సభలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిస్తే టీడీపీ ఇంటింటికి కిలో బంగారం, బెంజ్ కారు ఇస్తామని చెబుతోంది.. టీడీపీ చరిత్ర అంతా అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు. 2014లో అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలోని హామీలను తుంగలో తొక్కి.. ఇప్పుడు సూపర్-6, సూపర్-7 అంటూ పేదల రక్తాన్నీ పీల్చేందుకు పసుపుపతి (చంద్రబాబు) మళ్లీ వస్తున్నాడని ఎద్దేవా చేశారు. మరోసారి ...

Read More »

చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న ఏడో రోజు మేమంతా సిద్ధం యాత్ర..

మరోసారి విజయమే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏడో రోజుకు చేరుకుంది. ఈనాటి యాత్ర ఉదయం 9 గంటలకు చిత్తూరు జిల్లాలోని అమ్మగారిపల్లె నుంచి ప్రారంభమయింది. ఈరోజు గోడ్లవారిపల్లె, గుండ్లపల్లిలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 4 గంటలకు పూతలపట్టు బైపాస్ రోడ్డు (మొధిగారిపల్లె) వద్ద జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. రాత్రికి శ్రీకాళహస్తి నియోజకర్గం రేణిగుంట సమీపంలోని గురువరాజుపల్లెలో జగన్ బస చేస్తారు. ఈనాటి యాత్ర నేపథ్యంలో… చిత్తూరు జిల్లా సిద్ధమా? ...

Read More »