Tag Archives: ysrcp

14వ రోజుకు చేరిన జగన్ బస్సు యాత్ర

సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 14వ రోజుకు చేరింది. ఉమ్మడి గుంటూరు (D) నంబూరు బైపాస్ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. కాజా, మంగళగిరి బైపాస్, CK కన్వెన్షన్ మీదుగా యాత్ర సాగనుంది. ఉదయం 11 గంటలకు చేనేత కార్మికులతో జగన్ ముఖాముఖి కానున్నారు.

Read More »

సోనియానే ఎదిరించారు.. పవన్ ఎంత?: వెల్లంపల్లి శ్రీనివాస్

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. ఓ వైపు రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని విమర్శిస్తున్న చంద్రబాబు… ఇప్పుడు ఎన్నికలు రావడంతో ప్రతి ఇంటికి రెండు పథకాలు ఇస్తానని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేనప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తానని ఎలా హామీ ఇస్తున్నారని ప్రశ్నించారు. విజయవాడ నగర అభివృద్ధిని చంద్రబాబు విస్మరించారని… ఆయనకు విజయవాడలో తిరిగే అర్హత లేదని అన్నారు. కక్ష సాధింపులను పాల్పడేది చంద్రబాబేనని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ...

Read More »

షర్మిల చేసిన త‌ప్పు అదే: విజ‌య‌సాయి రెడ్డి

వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌పై ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ష‌ర్మిల‌ తెలంగాణ‌లో పార్టీ పెట్టిన‌ప్పుడు తాము ఏమీ అన‌లేద‌ని, కానీ ఏపీకి వచ్చి కాంగ్రెస్‌లో చేర‌డం ఆమె చేసిన రాజ‌కీయ త‌ప్పిదం అని అన్నారు. ఆమె వెనుక ఎవ‌రు ఉన్నారో కూడా అంద‌రికీ తెలుస‌ని విజ‌య‌సాయి అన్నారు. అలాగే సీఎం జ‌గ‌న్‌తో ష‌ర్మిల రాజ‌కీయంగా విభేదించిన మాట వాస్త‌వ‌మేన‌న్నారు. ఇక ఎన్‌డీఏలో వైసీపీ చేరిక‌పై కూడా ...

Read More »

వైయ‌స్ఆర్‌సీపీలోకి భారీగా వ‌ల‌స‌లు..

ఎన్నిక‌ల వేళ తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీల నుంచి భారీగా వ‌ల‌స‌లు మొద‌ల‌య్యాయి. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంక్షేమ పాల‌న‌కు ఆక‌ర్శితులైన టీడీపీ, జన‌సేన కీల‌క నేత‌లు వైయ‌స్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇవాళ మేమంతా సిద్దం బస్సుయాత్రలో పల్నాడు జిల్లా గంటావారిపాలెం నైట్‌ స్టే పాయింట్‌ వద్ద ముఖ్యమంత్రి వైయస్‌. జగన్‌ సమక్షంలో జనసేన, తెలుగుదేశం పార్టీల నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు చేరారు.

Read More »

జనసేనకు గుడ్ బై చెప్పి.. వైసీపీలో చేరిన పోతిన మహేశ్

రెండు రోజుల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేశ్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పోతిన అనుచరులు కూడా వైసీపీలో చేరారు. వీరందరికీ జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. విజయవాడ వెస్ట్ నుంచి జనసేన టికెట్ ను పోతిన ఆశించి భంగపడ్డారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ తీసుకుంది. ఈ స్థానం నుంచి బీజేపీ తరపున రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనా చౌదరి బరిలోకి దిగారు. ఈ ...

Read More »

షర్మిల వ్యాఖ్యలపై తొలిసారిగా స్పందించిన అవినాశ్ రెడ్డి

వివేకా హంతకుడు ఎంపీ అవినాశ్ రెడ్డి అంటూ వైఎస్ షర్మిల చేస్తున్న తీవ్ర వ్యాఖ్యల పట్ల ఎంపీ అవినాశ్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. ఆమె మాట్లాడుతున్న మాటలు వినడానికి భయంకరంగా ఉన్నాయని అన్నారు. ఆ మాటలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. మసి పూస్తారు, బురద చల్లుతారు… వాళ్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు… వాళ్ల విచక్షణకే వదిలేస్తున్నా… దీని గురించి ఎక్కువగా చర్చించాల్సిన అవసరం కూడా లేదు అని అవినాశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంత మాట్లాడుకోవాలంటే అంత మాట్లాడుకోండి… నాకెలాంటి అభ్యంతరం లేదు… ...

Read More »

గూగుల్‌ ట్రెండ్స్‌లో టాప్‌ సీఎం జగన్‌

ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌ ప్రజల తీర్పు సుస్పష్టంగా ఉండబోతుందని గూగుల్‌ ట్రెండ్స్‌ చెబుతున్నాయి. ఏపీ రాజకీయాల గురించి చేసే వేర్వేరు ప్లాట్‌ఫాంలపై చేసే పోస్టులను విశ్లేషించి, ఎవరిపై ఏ టాపిక్‌పై ఎంత సమయం గడుపుతున్నారన్న దాన్ని బట్టి.. గూగుల్‌ ట్రెండ్స్‌ ఫలితాలు ఇస్తుంది. ఏపీ పాలిటిక్స్‌కు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టాప్‌లో ఉండగా.. దరిదాపుల్లో కూడా చంద్రబాబు లేకపోవడం గమనార్హం.

Read More »

కూటమిలో వారికి ప్రిఫరెన్సే లేదు.. సజ్జల కీలక వ్యాఖ్యలు

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన, టీడీపీ అభ్యర్థులను చంద్రబాబే నిర్ణయిస్తున్నారని ఆరోపించారు. కూటమిలో జనసేన, బీజేపీకి అసలు ఉనికే లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అనుకున్న వాళ్లకే టికెట్లు ఇచ్చుకున్నారని తెలిపారు. కూటమిలో చంద్రబాబు ఏది చెబితే అదే జరగాలని కోరుకుంటున్నారన్ని పేర్కొన్నారు. ప్రజలు ఏమనుకుంటారనే ఆలోచన లేకుండా బాబు ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వ్యవస్థలను చంద్రబాబు ...

Read More »

కావలిలో నేడు సీఎం జగన్ బహిరంగ సభ

సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నేడు నెల్లూరు జిల్లాలో కొనసాగనుంది. ఉదయం 9గంటలకు చింతరెడ్డిపాలెం నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. కొవ్వూరు క్రాస్, గౌరవరం మీదుగా కావలి జాతీయ రహదారి వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3గంటలకు అక్కడ బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్రోడ్, ఓగూరు, వెంకుపాలెం మీదుగా జువ్విగుంట చేరుకుని రాత్రికి అక్కడ బస చేస్తారు.

Read More »

సీఎం జగన్ సంచలన నిర్ణయం.. మరో వంద సభలకు ప్లాన్

ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ దూకుడు పెంచారు. ఇప్పటికే మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టి జనాల్లో తిరుగుతున్నారు. అనంతరం భారీ బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. ప్రజలను ఆకర్షించేలా హామీ ఇస్తున్నారు. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎన్నికల సమయం వరకూ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మొత్తం వంద సభలు, రోడ్ షోలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రతి రోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Read More »