వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్నినాని తెలుగుదేశం మీడియాగా గుర్తింపు పొందిన ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర సంస్థలపై తీవ్రమైన విమర్శలు చేశారు. అవి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలుగా మారాయని అన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు తప్పుడు ,అబద్దపు వార్తలు ప్రచారం చేసిన ఈ మీడియా సంస్థలు తమ పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా అదే రీతిలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన చెప్పిన విషయాలన్నీ వాస్తవమే అని బోధ పడుతుంది. కారణం ఏమైనా ఈనాడు తదితర ఎల్లో మీడియా వైఎస్సార్సీపీపైన, మాజీ ముఖ్యమంత్రి జగన్ పైన ఆ స్థాయిలో కక్ష బూనాయి. ఆయనను ఇప్పుడు సైతం అడుగడుగునా అవమానించాలని, వేధించాలని ఆ మీడియా సంస్థలు కృతనిశ్చయంతో ఉన్నట్లు అర్థం అవుతుంది. లేకుంటే ఎన్నికల ఫలితాల తర్వాత కూడా తప్పుడు సమాచారంతో కధనాలు ఎందుకు వండి వార్చుతారు! దానికి పెద్ద ఉదాహరణ జగన్ భద్రతకు సంబంధించి వచ్చిన వార్త అని చెప్పవచ్చు. ఏకంగా 986 మందిని జగన్ రక్షణకు వినియోగించారని, ఇందువల్ల ప్రభుత్వానికి 286 కోట్ల వ్యయం అయిందంటూ ఒక వార్తను జనం మీదకు వదిలారు. ఎవరైనా చదివినవారికి ఇది డబ్బు దుర్వినియోగమే అన్న అభిప్రాయం కలిగేలా వారు తమ టీవీలలో,పత్రికలలో ప్రచారం చేశారు. తీరా చూస్తే అదంతా అబద్దపు వార్తగా తేలింది.ఆ వివరాలను పేర్నినాని మీడియాకుతెలియచేశారు. అయినా దానిని టీడీపీ మీడియా సక్రమంగా ఇవ్వదనుకోండి. అది వేరే విషయం కాని, కచ్చితంగా ఈ సంస్థలు ఎన్నికల తర్వాత కూడా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీని కొనసాగిస్తున్నాయన్న భావన కలుగుతుంది.
- Home
- News
- Andhra Pradesh
- రాజగురువు లేడు అయినను విషపు రాతలు రాయించవలె..!