నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు లో తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు. నల్లగొండలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఇప్పటివరకూ రెండు రౌండ్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ (తీన్మార్ మల్లన్న) భారీ ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్‌లో మల్లన్నకు 34,575 ఓట్లు వచ్చాయి. మరోవైపు, బీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డికి 27,573 ఓట్లు పోలయ్యాయి. దీంతో, మల్లన్నకు 7,002 ఓట్ల ఆధిక్యం వచ్చింది. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి 12,841 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 11,018 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి.