హైదరాబాదు వాసులకు బిగ్ అలర్ట్. కృష్ణా తాగునీటి సరఫరా పథకం ఫేజ్-2 లో కోదండాపూర్ పంప్జౌజ్ లో భారీ ఎన్‌ఆర్వీవాల్వ్ మరమత్తులకు గురైంది. కాగా తక్షణమే మరమత్తుల కోసం నీటి సరఫరాను నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో నేడు నగరంలో పలు ప్రాంతాల్లో ఈ రోజు, రేపు తాగునీటికి కొరత ఏర్పడనుందని హైదరాబాదు మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. పలు ప్రాంతాల్లో తక్కువ నీటి సరఫరాకు పాక్షికంగా అంతరాయం ఏర్పనుందని పేర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ మొత్తంలో నీటి సరఫరా జరగుతుందని తెలిపారు. కాగా ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు నీటిని పొదుపుగా యూజ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్న ప్రాంతాలు చూసుకున్నట్లైతే.. బాలాపూర్, ఎన్పీఏ, మీరాలం, మేకలమండి, మైసారం, భోజగుట్ట, బార్కస్, భోలక్పూర్, తార్నాక, చిలకలగూడ, తార్నాక, మారేడుపల్లి, బైద్ధనగర్, లాలాపేట్, ఎంఈఎస్, రైల్వేస్, పాటిగడ్డ, కంటోన్మోంట్, ప్రకాశ్‌గనర్, హస్మత్పేట్, గౌతమ్ నగర్, ఫిరోజ్ గూడ, బీఎన్‌రెడ్డినగర్, వైశాలినగర్, ఆలోనగర్, వనస్థలిపురం, ఆటోనగర్, మహేంద్రహిల్స్, అల్కాపురి కాలనీ, రామంతాపూర్, ఏలుగుట్ల, ఉప్పల్, బీరప్పగుట్ట, నాచారం, హబ్సిగూడ, చిల్కానగర్, శాస్త్రిపురం, బుద్వేల్, మీర్సేట్, శంషాబాద్, బడంగపేట్ ప్రాంతాల్లో నేడు (జూన్ 27)నీటి కొరత ఏర్పడనుంది.