సింగరేణి గనులు దక్కకపోడవడానికి కారణం బీఆర్ఎస్, బీజేపీయేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలకు కౌంటర్‌గా మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగానే సింగరేణికి గనులు కేటాయించడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే వేలంపాటలో పాల్గొనాలంటూ డిప్యూటీ సీఎం చెబుతున్నారని కౌంటర్ ఇచ్చారు. సింగరేణిని ప్రైవేటుపరం చేసేందుకే వేలంలో పాల్గొంటున్నామంటున్నారని ఫైర్ అయ్యారు. ఒకవేల బొగ్గు గనులు కేటాయింపు జరగకపోతే సింగరేణి తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు.