ఎన్నికల ముందు రాష్ట్రంలో మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలంటూ ఆ పార్టీ చేసిన ప్రచారంపై బీఆర్ఎస్ నేత అనుగుల రాకేష్‌రెడ్డి సెటైర్లు వేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అన్ని రంగాల్లో సర్కారు ప్రజలను పీడిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు. ఆరు నెలల పాలనలో ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, గురుకుల టీచర్లు, గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఆశావహులు, నిరుద్యోగ యువత, జీవో 46 బాధితులు, డీఎస్సీ ఆశావహులు అంతా రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందంటూ సెటైర్లు వేశారు. మరోవైపు గురుకుల టీచర్లు నియామక పత్రాలు ఇచ్చి వారికి పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం వారి జీవితాలతో ఆటలు ఆడుతుందని అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సీఎంతో సహా మంత్రలు కూడా రొడ్డెక్కే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి నిరుద్యోగులను ఆదుకుని ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అనుగుల రాకేష్ రెడ్డి డిమాంబ్ చేశారు.