ఇవాళ సాయంత్రం తెలంగాణ కేబినెట్‌ సమావేశం..

REDDY-21.jpg

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్‌ సమావేశంలో రైతు రుణమాఫీతోపాటు కీలక అంశాలపై చర్చించనున్నారు. పరిపాలనకి సంబంధించిన అనేక అంశాల పై చర్చించనున్నారు. ఇరు రాష్ట్రల మధ్య ఆస్తులు, అప్పుల పంపకాల పై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రైతు రుణమాఫీ, రైతు భరోసాకి నిధుల సమీకరణ పై చర్చ..కట్ ఆఫ్ పెట్టాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. రుణమాఫీ పై మహారాష్ట్ర, రాజస్థాన్ లో పర్యటించి తెలంగాణ అధికారులు బఅధ్యయనం చేశారు. విద్యుత్ ఒప్పందాలు, కాళేశ్వరం పై చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వనికి ఆదాయం వచ్చే మార్గాల పై దృష్టి సారించారు. భూముల రిజిస్ట్రేషన్ ధరల పెంపు, లిక్కర్ ధరలు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ సమావేశాలపై చర్చించి తేదీలను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి.

Share this post

scroll to top