నవ దంపతులకు రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకు గాను ప్రభుత్వం తాజాగా రూ.725 కోట్ల నిధులు మంజూరు చేసింది. 2024-25 బడ్జెట్‌లో భాగంగా కేటాయించిన నిధుల విడుదలకు అనుతి అభించింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ బుద్ధ వెంకటేశం శనివారం ఉత్తర్వులను జారీ చేశారు. కాగా, ఎన్నిక ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల కింద యువతుల వివాహాల కోసం రూ.1,00,116 ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి విధితమే. ఈ క్రమంలో అదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించి తాజాగా నిధులు విడుదల చేసింది.