జూబ్లీహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జర్నలిస్టు కాలనీ బస్టాప్ ఎదురుగా ఉన్న బహుళ అంతస్తుల భవనంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల పార్కింగ్ ఏరియాలో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన వెంటనే ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. భవనం లోపల నుంచి పొగ కమ్ముకుంది. పొగ కారణంతో కొంతమంది ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక అధికారులు ఘటన చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్‌ను స్టోర్ రూంగా భవన యజమానులు వినియోగిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉంది.