తెలంగాణలో మే 29 వరకు లాక్‌డౌన్‌ : సీఎం కేసీఆర్‌
తెలంగాణలో మే 29 వరకు లాక్‌డౌన్‌ : సీఎం కేసీఆర్‌

తెలంగాణలో మే 29 వరకు లాక్‌డౌన్‌ : సీఎం కేసీఆర్‌

తెలంగాణలో లాక్‌డౌన్‌ను మే 29 వరకు పొడిగించినట్లు సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. గ్రీన్ లేదు.. రెడ్ లేదు.. అన్ని జిల్లాల్లో మే 29 వరకూ రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కొద్దిరోజులు ఓపికపడితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. తెలంగాణలో టెస్టింగ్‌ కిట్ల కొరత లేదని చెప్పారు. అయితే.. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్‌లో కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు ప్రకటించారు. మండల కేంద్రం, రూరల్‌ ప్రాంతాల్లో అన్ని షాపులకు అనుమతి ఉంటుందని ఆయన తెలిపారు. మున్సిపాలిటీల్లో 50 శాతం షాపులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. లాక్‌డౌన్‌, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కరోనా వ్యాప్తి వంటి అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం ప్రగతి భవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం సీఎం మీడియా సమావేశంలో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో మద్యం షాపులు బుధవారం నుంచి తెరచుకుంటాయని చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమ్మకాలకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. రైతుబంధు పథకం కొనసాగిస్తామని స్పష్టం చేశారు