నిజామాబాద్ కాంగ్రెస్‌లో కల్లోలం.. పార్టీలోకి పోచారం రావొద్దంటూ దిష్టిబొమ్మ దహనం

POCHRAM-21-.jpg

మాజీ స్పీకర్ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే వార్తలు వెలువడుతున్న వేళ ఆ పార్టీ కేడర్‌లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ మేరకు పోచారం చేరికన వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్ నాయకులు శుక్రవారం కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు గంగాధర్ దేశాయి మాట్లాడుతూ.. నాడు రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని వీడి అధికారం కోసం బీఆర్ఎస్‌లో చేరి పదవులు అనుభవించారని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి రాష్టంలో అధికారం చేపట్టడంతో పదవి కోల్పోయిన మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం పదవుల కోసమే పార్టీ మారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పోచారం పార్టీలోకి రావొద్దంటూ నినాదాలు చేస్తూ.. దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాస్, వహీద్, బీమా సాయిరెడ్డి, ఆనంద్, కిషన్, తదితరులు పాల్గొన్నారు.

Share this post

scroll to top