విద్యుత్ వివాదం.. KCR పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..

kcr-28.jpg

విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయంలో లోటుపాట్లను సమీక్షించడానికి జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటుపై మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. అయితే తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. కేసీఆర్ పిటిషన్‌పై తీర్పును ఈ రోజు లేదా సోమవారం వెల్లడిస్తామని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం తరఫున వాదనలను ఏజీ వినిపించారు. కాగా, విద్యుత్ కొనుగోలు అంశంపై హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Share this post

scroll to top